
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అలాగే వెండితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేని నటి దివి. ఈమె గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మహర్షి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు చిన్న చిన్న పాత్రలలోనే నటిస్తోంది. తన నటనతో అందరిని ఆకట్టుకున్న దివి బిగ్ బాస్ హౌస్ లో కూడా కంటెస్టెంట్గా వెళ్లి అవకాశం అందుకుంది. తన గ్లామర్ తోనే భారీ పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ దివి హౌస్ నుంచి బయటికి వచ్చాక పలు సినిమాలలో వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ మరింత క్రేజ్ అందుకుంది.
అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలనే కాకుండా గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ అధరహో అనిపిస్తుంది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి తన బ్రేకప్ గురించి వెల్లడించింది. దివి మాట్లాడుతూ.. నేను ప్రేమించిన అబ్బాయికి వివాహమయ్యింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తనకు మంచి వైఫ్ దొరికిందంటూ తెలియజేసింది. ప్రస్తుతం తన మాజీ బాయ్ ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఉన్నారంటూ తెలిపింది.
వివాహమైన తర్వాత మళ్లీ తామిద్దరం అసలు మాట్లాడుకోలేదని మనం ఇష్టపడిన వ్యక్తి సంతోషంగా ఉండడమే మనకి కావాల్సింది. అయితే వాళ్ల పేరెంట్స్ అందరికీ తాను అంటే చాలా ఇష్టమని కానీ మా ఇద్దరికీ రాజు పెట్టలేదు అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది దివి. ప్రస్తుతం బిగ్ బాస్ దివి చేసిన ఈ కామెంట్ వైరల్ గా మారుతున్నాయి. దివి బిగ్ బాస్ తెలుగు సీజన్4 లో పాల్గొనింది. అయితే ఈమె కేవలం హౌస్లో 49 రోజులు మాత్రమే ఉండి ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యింది. చివరిగా డాకు మహారాజ్ సినిమాలో కనిపించింది దివి. మొత్తానికి తన బ్రేకప్ విషయాన్ని తెలిసి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.