
జర్నీఫర్ మిస్త్రీ బన్సీవాల్ మాట్లాడుతూ.. 2018లో జరిగిన సంఘటన గురించి తెలియజేసింది. తనను తారక్ మెహతకా ఉల్టా చష్మా షోలో ప్రముఖ నిర్మాత ఆసిత్ కుమార్ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు చేస్తోంది.. అందుకే తాను ఈ విషయంపై షో ఆపరేటర్ హెడ్ సోహెల్ రమణకి కూడా ఫిర్యాదు చేశానని.. తన శరీరం పైన చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని తెలిపింది.. అయితే ఆ తర్వాత మళ్లీ 2019లో సింగపూర్లో జరిగిన షూటింగ్లో మరో దారుణమైన అనుభవం కూడా ఎదురైందని తెలిపింది ఈ నటి.
ఒక కాఫీ షాప్ లో అసిత్ మోదీ తన పెదాలను చూసి చాలా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారని ముద్దు పెట్టుకోవాలని ఉందని కొన్ని వ్యాఖ్యలు చేయడంతో చాలా ఇబ్బంది పడ్డానని తనను మానసికంగా క్షోభకు గురయ్యేలా చేశాయని తెలిపింది.. అందుకే 2023 లో తారక్ మొహతకా ఉల్టా షో నుంచి తప్పుకున్నానంటూ తెలియజేసింది. అంతేకాకుండా కొన్ని బడ సంస్థలు కూడా ఈ షో నుంచి స్పాన్సర్షిప్ ను రద్దు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలియజేసింది. సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం వస్తున్న ఎంతో మంది అమ్మాయిలకు ఇలాంటి వేధింపులు ఎదురవుతున్నాయని.. చాలామంది ఆశపెట్టి లొంగ తీసుకుంటున్నారంటూ జర్నీఫర్ మిస్త్రీ బన్సీవాల్ తెలియజేసింది. అయితే ఈ నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.