మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న ఫోన్ అంటే ఒప్పో.. ఈ కంపెనీ ఫోన్లు సరికొత్త ఫీచర్లతో యువతను ఆకట్టుకుంటుంది. ఇటీవల ఒప్పో నుంచి వచ్చిన ఫోన్లు ప్రజలను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఫోన్ మార్కెట్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు.ఏ12 స్మార్ట్ ఫోన్‌పై ధర తగ్గింపును అందించింది. రెండు వేరియంట్లపై రూ.500 తగ్గింపును అందించారు. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. 4320 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఇందులో అందించారు. 64 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కూడా అందించారు.



రెండు వేరియంటలలో ఈ ఫోన్ మార్కెట్ అందుబాటు లోకి వచ్చింది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ధర లాంచ్ అయినప్పుడు రూ.8,990గా ఉండేది. దీని ధర రూ.8,490కు తగ్గింది. అలాగే 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,490 నుంచి రూ.10,990కు తగ్గింది.. ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికొస్తే..ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ35 ఆక్టాకోర్ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు స్టోరేజ్ ను పెంచుకోవచ్చు. 



ఫోన్ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే ఫేస్ అన్ లాక్ సపోర్ట్ కూడా దీనికి ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4320 ఎంఏహెచ్‌గా ఉంది. మొత్తానికి మార్కెట్ లో ప్రత్యేకతలు అందరిని ఆకట్టుకోవడం తో మార్కెట్ లో డిమాండ్ కూడా భారీగా పెరిగింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: