ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో అలర్ట్ గానే ఉంటారు. అందులో ఎక్కువగా వాడేది వాట్సప్, ఫేస్ బుక్. ఇక ఫేస్ బుక్ విషయానికి వస్తే ,ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. సాధారణంగా మన ఫేస్ బుక్ అకౌంట్ లో యూజర్ల పోస్ట్ లను  లైక్ చేసినా, షేర్ చేసినా,ఎవరు చేశారో కనిపిస్తుంది. కానీ మన ప్రొఫైల్ ఎవరు చూశారో అనే విషయాలు మాత్రం  తెలియవు. కానీ ఇప్పుడు మీ ప్రొఫైల్ ను ఎవరు చూశారో తెలుసుకోవాలంటే ఇలా చేస్తే సరిపోతుంది.


ఫేస్ బుక్  ఐఓఎస్ యాప్ లో  అయితే మన ప్రొఫైల్ ని ఎవరు చుశారో అనే వివరాలు ప్రైవసీ సెట్టింగ్స్ లో కనిపిస్తాయి. అలాగే డెస్క్ టాప్  లో కూడా మన సమాచారాన్ని తెలుసుకునే మార్గం ఉంది. వీటిని తెలుసుకోవాలంటే రెండు మార్గాలున్నాయి.


ఐఓఎస్ వినియోగదారులు: యాపిల్ ,ఐఓఎస్ లో ఫేస్ బుక్ వాడే వారు ప్రైవసీ సెట్టింగ్ ద్వారా మన ప్రొఫైల్ చూసిన వారిని గుర్తించవచ్చు. ఇందుకు ముందుగా యూజర్లు ఫేస్ బుక్ యాప్ లోని సెట్టింగ్స్ ఓపెన్ చేసి, తర్వాత ప్రైవసీ షార్ట్ కట్స్ కి వెళ్ళాలి. అక్కడ ' who viewed my profile ' అనే ఆప్షన్ కనిపిస్తుంది .దీంతో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు .అయితే ఈ ఆప్షన్ కేవలం ఐఓఎస్ ఫేస్ బుక్  యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని 2018 లోనే ఫేస్ బుక్ ఐఓయస్ యూజర్ల కోసం ఈ ఆప్షన్ ను  ప్రవేశపెట్టింది. కానీ ఆండ్రాయిడ్  యూజర్లకు ఫేస్ బుక్ యాప్ లో ఇంకా ఈ ఆప్షన్ అందుబాటులోకి రాలేదు.


డెస్కుటాప్ ద్వారా: ఫేస్ బుక్  లో మీ ప్రొఫైల్ ఎవరు చూశారో తెలుసుకోవడానికి డెస్క్ టాప్  లో  ఫేస్ బుక్. కామ్ ఓపెన్ చేయాలి. తద్వారా హోం పేజీలో ఎక్కడైనా రైట్ క్లిక్ చేసి "వ్యూ పేజ్ సోర్స్"  ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత  BUDDY_ID కోసం సెర్చ్ చేయాలి. ప్రతి బడ్డి_ ఐడి ట్యాగ్ కు  కుడిపక్కన 15 డిజిటల్ నెంబర్ లు కనిపిస్తాయి. ఈ పదిహేను అంకెల ప్రొఫైల్ ఐడి ని కాపీ చేసి, మీ బ్రౌజర్ లో కొత్త ట్యాబ్ ను ఓపెన్ చేసి, FACEBOOK.COM/PROFILE ID (15) నెంబర్ ను ఎంట్రీ చేయాలి. తద్వారా ఫేస్ బుక్  నేరుగా మీ ప్రొఫైల్ ని విజిట్ చేసిన వారి ప్రొఫైల్ ను  చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: