
**భయంకర వర్షాలు**
ఉష్ణోగ్రతల పెరుగుదల కారణం భారత్ లాంటి దేశాల్లో వడగాల్పులు ఎక్కువవుతాయి. ఫలితంగా వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వాయువు ఉద్గారాలు పెరిగి గాలి యొక్క నాణ్యత తగ్గిపోతుంది. మిగతా సముద్రాలతో పోల్చి చూస్తే హిందూ మహాసముద్రమే తొందరగా, ఎక్కువగా వేడెక్కుతోంది. 21వ శతాబ్దం చివరి నాటికి భారత దేశంలో వానాకాలం సుదీర్ఘంగా ఉంటుందని నివేదిక తయారీ లో పాల్గొన్న ఫ్రెడరిక్ ఓటో విశ్లేషించారు. దేశంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల భూమి తమ తేమ శాతన్ని కోల్పోతుందని, కరువు పరిస్థితులు ఎక్కువవుతాయని పరిశోధనలో పాల్గొన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాపికల్ రీసెర్చ్‌లోని వాతావరణ పరిశోధన కేంద్రం ఈడీ ఆర్ క్రిష్ణన్ తెలిపారు. పట్టణాల్లో వర్షపాతం పెరగడానికి మధ్య సంబంధం ఉందని తెలిపారు.
**ఒక్కరూ సురక్షితంగా లేరు**
వాతావరణ సంక్షోభ ప్రభావం ప్రపంచం మొత్తం తీవ్రంగా కనిపిస్తూనే ఉన్నది. ఏ ఒక్కరూ కూడా సురక్షితంగా లేరు. పర్యావరణ పరిరక్షణకు మనం తక్షణం ముందుకు సాగాలి. లేదంటే మన జీవితాలు, జీవనోపాధులు తీవ్రంగా దెబ్బతింటాయని ఐరాస వాతావరణ కార్యనిర్వాహక డైరెక్టర్ ఇగ్నెర్ ఆండెర్సన్ హెచ్చరికలు జారీ చేశారు.