ఏసీ ని కనిష్ట ఉష్ణోగ్రత వద్ద సెట్ చేసినప్పుడు గది వేగంగా కూలింగ్ అవుతుందని నమ్ముతూ ఉంటారు.కానీ ఇందులో నిజం లేదట.. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్ ప్రకారం 24 డిగ్రీల వద్ద ఏసీ ఆపరేటింగ్ చేయవలసి ఉంటుందట. 24 డిగ్రీల వద్ద మానవ శరీరానికి సరిపడా ఎయిర్ కండిషన్ ని సెట్ చేసుకున్నట్లు అయితే విద్యుత్ వినియోగానికి గమనీయంగా ప్రభావితం చెందుతుందట. ఉష్ణోగ్రతను ఒక యూనిట్ తగ్గించడం వల్ల విద్యుత్ వినియోగం 6% పెరిగిపోతుందట అందుచేతనే గదిని ఒక మోస్తారులో 20-24 డిగ్రీల మధ్య ఉంచడం మంచిది.
ముఖ్యంగా ఏసీ పైన ఒత్తిడి ఉంచకూడదు ఏసీ సామర్థ్యం పెరగడమే కాకుండా తక్కువ విద్యుత్తును కూడా వినియోగించాలి అంటే కచ్చితంగా ఫిల్టర్ ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండడమే కాకుండా దుమ్ము దూళి వంటిని కూడా తెలుపుతూ ఉండాలి. ఫిల్టర్లలో ఏదైనా దుమ్ము అడ్డం ఉన్నట్లుగా అయితే కూలింగ్ పని తీరు పైన ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల ఎక్కువ కరెంటు కూడా లాగేస్తుందట.
ఏడాదిలో ఒక్కసారైనా సాధారణ సర్వీసింగ్ చేయించాలి.. గాలి ప్రసరణను మరింత మెరుగుపరచడానికి ఏసీ కూలింగ్ వేగాన్ని మెరుగుపరచడానికి అప్పుడప్పుడు సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేస్తూ ఉండాలి. ఏసీ ని సరైన కూలింగ్ లో ఉంచినప్పుడు కిటికీ తలుపులు గది తలుపులు గాలి బయటకు వెళ్లకుండా మూసివేయాలి.
మనం నిద్రపోయే ముందు ఏసీని రెండు గంటల తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేలా టైమర్ ని సెట్ చేసుకోవాలి.. రాత్రిపూట ఏసిన ఉపయోగించడం వల్ల తక్కువ విద్యుత్ అవసరం అవుతుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి