
వాస్తవానికి ఇప్పటికి ఏబిఎస్ విధానం ఉన్నప్పటికీ కూడా కేవలం..150 C.C కంటే ఎక్కువ ఇంజన్ కలిగి ఉన్న టూ వీలర్లకు మాత్రమే ఇది కచ్చితంగా ఉండేది.. అయితే ఇప్పుడు ఈసారి ప్రారంభం అయ్యే మోడల్స్ లలో కూడా అన్ని టూ వీలర్లకు వర్తింపజేసేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా ఉండే వాహనాలలో 75% వాహనాలు ఎంట్రీ లెవెల్ మోడల్ లోనే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని తెలుపుతున్నారు. 2022 లెక్కల ప్రకారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా 20% వరకు టూ వీలర్ మూలంగానే జరిగినట్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందట.
అందువల్లే ఇకమీదట టూ వీలర్లకు ఏబీఎస్ విధానం కచ్చితంగా ఉండాలని పలు రకాల కంపెనీలకు కూడా నిషా నిర్దేశాలను జారీ చేసింది..ఈ యాంటీ లాక్ బ్రేక్ సిస్టం..(ABS) ఉండడం వల్ల సడన్ బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ కాకుండా చేస్తుందట. దీనివల్ల వాహనం మీద డ్రైవర్ నియంత్రణ కలిగి ఉండడంతో పాటుగా వాహన స్కిడ్ కాకుండా ఉంటుంది అంటూ తెలియజేస్తున్నారు. అయితే ABS ప్రతి బైక్ కి అమర్చడం వల్ల ధరలు పెరుగుతాయని తెలుస్తోంది. టూవీలర్ మోడల్స్ ను బట్టి 2500 నుంచి 5వేల రూపాయల వరకు బైక్పైన ధర పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక మీదట వాహనాల మీద ప్రయాణించే ఇద్దరికీ హెల్మెట్ ఉండాలని నిబంధన కూడా తీసుకురాబోతున్నారు.