ఆడవారికి పూలు అంటే చాలా ఇష్టం. ఈ పూలలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కనకాంబరం, మల్లెపూలు, గుండు మల్లెలు,సెంటు జాజులు,  ఇలా చాలా విధాలుగా పూలు ఉన్నాయి. పూలంటే ఇష్టం ఉన్న పిల్లలు తమ తల్లిని తమ కోసం పూలు తీసుకుని రా అని చెబుతూ ఉంటారు. తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అంటే కచ్చితంగా ఇలా ఉంటుందని మాటల్లో వర్ణించలేము. ఆ ప్రేమ లోతుపాతులను సృజీస్తేనే అసలు విషయం బోధపడుతుంది. నెస్సేసిటి ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్న నానుడి గుర్తుకు తెచ్చే ఓ విషయం ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. తన బిడ్డలు ఏమడిగినా తన చేతులతో చేతి పెట్టాలని తల్లి పడే ఆరాటం ఇక ఇదో నిలువెత్తు రూపం అంటూ నెటిజన్లు  తల్లీ ప్రేమను పొగుడుతున్నారు.



 తన కుమార్తె కోరిందని ఓ అమ్మ ఏకంగా ట్యూబ్ పేపర్ ను ఉపయోగిస్తూ తన సృజనాత్మకతకు మరింత పదును పెట్టి మల్లెమాల కట్టి మురిసిపోయింది. నిజానికి వయసురీత్యా ఆమెకు జాయింట్ పెయిన్స్ ఉన్న వాటన్నింటినీ లెక్కచేయకుండా తన కూతురు అడిగిందని కృత్రిమ మల్లెలు సృష్టించి వాటికి సువాసన చేర్చి మాలలా కట్టింది. దీన్ని ఆ కుమార్తె సోషల్ మీడియాలో పెట్టి షేర్ చేయగా వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ట్విట్టర్ యూజర్ సురేఖ ఇది మా అమ్మ టిష్యూ పేపర్ తో చేసినది అని పోస్ట్ చేసింది. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న తన తల్లి ఇందుకోసం గంటల తరబడి కూర్చుని తయారు చేసిందని చెప్పుకొచ్చింది.


 ఒక నెటిజన్ అయితే సురేఖవాళ్ల అమ్మ చేతిలో మ్యాజిక్ ఉందని కామెంట్ చేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన సురేఖ ప్రాణంలేని కాగితాలకు తన అమ్మ చేతుల స్పర్శతో ప్రాణం పోసిందని  ఆకట్టుకునేలా ట్వీట్ చేసింది. అయితే తామంతా ఇది నిజమైన గజ్రా అనుకున్నట్టు సురేఖ చెప్పేవరకు అవి కాగితంపూలు అని తెలియ లేదంటున్నారు. మరోవైపు వేలాది మంది నెటిజన్లు సురేఖ పోస్టులు లైక్ చేస్తున్నారు. ఇలాంటి మాలలను కేవలం మల్లెపూల లోనే కాకుండా చాలామంది ముద్దబంతి రోజాపూలు ఇలా ఇష్టం వచ్చిన పూలను కాగితంతో తయారు చేసుకొని మాల అల్లీతే అవి చెక్కుచెదరని వాటి సహజసిద్ధమైన పరిమళం అద్దెలా మంచి సెంట్ లేదా స్ప్రే చళ్ళితే ఇవి గమాగమాలాడుతాయి.


ఎత్నిక్ వేర్ తో పాటు ఇలాంటి పూలను పెట్టుకుంటే మీ అందం ఇనుమడిస్తుంది. హెయిర్ యాక్సెసరీస్ గా మార్కెట్లో ఇవ్వని అందుబాటులో ఉండగా వాటి ధర కాస్త ఎక్కువే. ఎంతైనా మనం ఇంట్లో అది కూడా మన చేతులతో చేసుకుంటే వచ్చే సంతృప్తి వేరు కదా. వేసవి మొదలవుతుంది మల్లెల ధర పెరుగుతుందని బాధ అక్కర్లేదు, అవి వాడి పోతాయి, రెక్కలు రాలిపోతాయి అనే బాధ అసలు అవసరం లేదన్న మాట. భరతనాట్యం కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యం చేసేవారు ఇలాంటి ఉపయోగించేవారు. కానీ పెళ్లిళ్లకు వీటిని ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతుండటంతో వీటిని ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: