వాషింగ్ మిషన్ లో నక్క ఏందీ అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పకుండా ఈ ఇన్సిడెంట్ తెలుసుకోవాల్సిందే..లండన్‌ కి నటాషా ప్రయాగ్ అనే ఓ స్త్రీకి ఈ షాకింగ్ ఇన్సిడెంట్ ఎదురైంది. ఆమె తన భర్త ఆడమ్ తో కలిసి బయట షాపింగ్ కి వెళ్లింది.షాపింగ్ అయిన తర్వాత ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కార్లోని సామాన్లు ఇంట్లో పెట్టారు. ఇంతలో వారికి ఇంట్లోకి ఏదో ప్రవేశించినట్లు అనిపించింది.


దీంతో వారిద్దరూ ఇంట్లోకి వెళ్లి దాని కోసం వెతకడం ప్రారంభించారు. ఆడమ్ వంటగదిలో వెతికితే.. ఆమె మిగతా గదులను చెక్ చేసింది.అయితే, వారికి గదుల్లో ఏమీ కనిపించలేదు. కిచెన్‌లోనే సింక్ కింద ఉన్న వాషింగ్ మెషీన్‌లో ఆడమ్‌కు ఒక చిన్న కుక్క చెవి కనిపించింది.అతను భయంతో వెంటనే దగ్గరకు వెళ్లకుండా.. దానికి కాస్త దూరంగా ఉండి చూశాడు. ఆ తర్వాత నటాషాను పిలిచాడు. కాసేపు వారికి అది కుక్కేమో అన్న సందేహం వచ్చింది.వారిని కష్టపెట్టడం ఎందుకు అనుకుందో ఏమో అది తన ముఖాన్ని బయటకు పెట్టి.. ‘‘నేను నక్కను’’ అన్నట్లుగా పోజు ఇచ్చింది. దీంతో నటాషా ఆ నక్కని ఫొటో తీసింది.


కానీ, ఆ నక్క చాలాసేపు ఆ వాషింగ్ మెషీన్‌లో నక్కి వుంది. వారు కూడా దాన్ని ఇబ్బంది పెట్టలేదు.ఇక చివరకు అది దానంతట అదే బయటకు వెళ్తేనే మంచిదని భావించి కాసేపు ఎదురు చూశారు. కొద్ది సేపటి తర్వాత ఆ నక్క బయటకు వచ్చి తెరిచి ఉన్న తలుపు నుంచి బయటకు వెళ్లిపోయింది. అది వారిపై దాడి చేయకుండా చాలా కూల్‌గా బయటకు వెళ్లిపోయింది.ఇక నటాషా ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.నెటిజనులు ఈ ఫొటోలు చూసి ఫన్నీగా స్పందిస్తున్నారు. కొందరు తమ ఇళ్లలో కనిపించిన ‘అనుకోని అతిథి’ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. చూశారుగా.. ఎప్పుడైనా తలుపులు తెరిచి వదిలేస్తే దొంగలే కాదు.. జంతువులు కూడా లోపలికి వస్తాయి. వీరి అదృష్టం బాగుండి ఆ నక్క దాడి చేయకుండా బయటకు వెళ్లిపోయింది.ప్రస్తుతం ఆ నక్క పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: