ఇక అప్పుడప్పుడు కొన్ని వింత ఆకారాలు కెమెరా కంట్లో పడటంతో అవి దెయ్యాలనే చాలా మంది కూడా నమ్ముతుంటారు. ఇదిలా ఉంటే, స్కాట్లాండ్‌లో జరిగిన ఓ వింత సంఘటన ఇప్పుడు ఆత్మలు ఇంకా దెయ్యాలు ఉన్నాయనే వాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది. దెయ్యాలు ఉన్నాయి అనే దానికి బలం చేకూర్చే వీడియో ఇది అంటూ నెటిజన్లు కూడా పలు రకాల కామెంట్లు చేస్తూ ఈ వీడియోకి సపోర్ట్ ఇస్తున్నారు.ఇక్కడ ఓ 2 సంవత్సరాల పిల్లవాడు..బెడ్‌రూమ్‌లో తన తండ్రితో పాటు బెడ్‌పై పడుకుని నిద్రపోవడానికి పడుకున్నారు. అది రాత్రి సమయం ఇద్దరూ కూడా ఇంకా నిద్రపోలేదు…తండ్రి మొబైల్ ఫోన్‌లో బాగా బిజీగా ఉన్నాడు..ఇక ఇంతలో ఆ చిన్నారి.. ఆ గదిలోని ఓ మూలకు చూస్తూ.. ఎవర్నో పలుకరిస్తున్నట్లుగా తన చెయ్యి పైకి ఎత్తాడు. అక్కడ హాయ్ చెబుతున్నట్లు చెయ్యి ఊపాడు. ఆది చూసిన దెబ్బకి ఆ తండ్రి షాక్‌ అయ్యాడు..ఇక ”అక్కడ ఎవరున్నారు?” అని అతను అడిగాడు. ఎందుకంటే తండ్రికి అక్కడ ఎవరూ కూడా కనిపించలేదు. కానీ పిల్లాడు మాత్రం మళ్లీ మళ్లీ చెయ్యి ఊపుతూ బాగా సంబరపడ్డాడు..ఆ తర్వాత ఆ చిన్నారి ఎవరో కితకితలు పెట్టినట్లు కాసేపు అలాగే నవ్వాడు. ఆ తర్వాత గది నుంచి వెళ్లిపోయేవారికి బాయ్ చెప్పినట్లు తన చెయ్యిని ఊపాడు.



అప్పటికీ తండ్రి “ఎవరికి హాయ్ చెబుతున్నావ్?” అని ఆ చిన్నారిని అడిగితే.. గాలిలోకి చెయ్యిని చూపించిన ఆ చిన్నారి… అలా కాసేపటి దాకా హాయ్ చెప్పి… ఆ తరువాత తన బెడ్‌పై వాలిపోయాడు. దీంతో ఆశ్చర్యపోయిన ఆ తండ్రి ఏం జరిగిందో అసలు అర్థం కాక కాసేపు అలాగే భయపడిపోయాడు. కానీ,నెమ్మదిగా అతను తేరుకుని ఆలొచించాడు. ఇక తన కొడుకుకి కనిపించింది చనిపోయిన బామ్మ అని అర్థమైనట్టుగా అతను చెబుతున్నాడు. ఆమె ఈమధ్యనే క్యాన్సర్‌తో చనిపోయింది.ఆమె చివరి రోజుల్లో ఆ చిన్నారి ఆమెతో ఎక్కువగా గడిపాడట.. దాంతో బామ్మతో మాత్రమే అలా చేతులు ఊపేవాడనీ, బామ్మ పట్టుకున్నప్పుడు అలా నవ్వేవాడని అతను తెలిపాడు. ఇంకెవరికీ ఇలా చేతులు ఊపలేదని అతను అంటున్నాడు.సో దీన్ని బట్టి దెయ్యాలు ఆత్మలు ఉండ వచ్చని ఈ వీడియోని చూసి నెటిజనులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: