
ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్న ఘటనలు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.. ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటివరకు యువకుడితో ఎంతో తీయగా మాట్లాడిన యువతీ రెప్పపాటుకాలంలో దోపిడీకి పాల్పడింది. ఇక్కడ దొంగతనం చేసిన అమ్మాయి గురించి తెలిసే ఈమె చోరీలు చేయడంలో ఏమైనా పీహెచ్డీ తీసుకుందా ఏంటి అని అందరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి. ఇక ఈమె ఎంతో తెలివిగా దొంగతనానికి పాల్పడిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్లో తెగ చక్కెర్లు కొడుతుంది.
ఒకసారి ఈ వీడియో లో చూసుకుంటే ఓ మహిళ మెట్రో స్టేషన్ రైలు ఆగగానే ఇక రైలు ఎక్కే డోర్ వద్ద నిలబడి ఉంది. అంతలోనే మెట్రో ట్రైన్ లోకి ఒక యువకుడు ఎక్కాడు. డోర్ వద్ద నిలబడి ఫోన్ చూస్తూ ఉన్నాడు. అలాంటి సమయం లోనే ప్లాట్ఫారంపై నిలబడిన యువతి అతని మాటల్లో పెట్టింది. ఎంతో తీయగా మాట్లాడుతూ మాటలు కలిపింది. సరిగ్గా మెట్రో రైలు డోర్ క్లోజ్ అవుతుంది అనుకుంటున్న సమయంలో క్షణాల వ్యవధిలో యువకుడి చేతిలో నుంచి ఫోన్ లాక్కుని వెళ్లిపోయింది. అయితే యువకుడు అప్రమత్తం అయినప్పటికీ అప్పటికే ట్రైన్ కదిలే సమయం కావడంతో ఏమీ చేయలేకపోయాడు.