ముఖ్యంగా మనుషుల్లాగానే ఎదుటివారి ఫీలింగ్స్ ని ఏనుగులు అర్థం చేసుకొని అందుకు తగినట్లుగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇక కొన్ని రకాల ఏనుగులు అయితే ఏకంగా మనుషులతో దగ్గర సంబంధాలను కొనసాగిస్తూ ప్రేమను వలకబోస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఏనుగులకు ఏదైనా సహాయం చేసినప్పుడు అవి తిరిగి సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తనదైన శైలిలో చెప్పడం లాంటివి ఇప్పటివరకు ఎన్నోసార్లు చూసాం. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ఇక్కడ ఒక ఏనుగుకు బాలిక సహాయం చేసింది..
అయితే ఇలా బాలిక సహాయం పొందిన ఆ ఏనుగు ఊరికే ఉండలేదు. ఏకంగా ఆ బాలికకు తన తొండంతో కృతజ్ఞతలు తెలపడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒక ఏనుగు పిల్ల గ్రామీణ రహదారి, చెరుకు పొలానికి మధ్య ఉన్న బురద గుంటలో చిక్కుకుపోయింది. అయితే అక్కడికి వచ్చిన బాలిక ఆ ఏనుగులు రక్షించడానికి ప్రయత్నించింది. ఏనుగు కాళ్ళను గుంటలో నుంచి బయటకు తీసింది. చివరికి గజరాజు ఆ గుంట నుంచి బయటపడడంతో హెల్ప్ చేసింది. అయితే బురద గుంట నుంచి బయటపడిన ఏనుగు ఏకంగా ఆ బాలికకు కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా తొండాన్ని ఎత్తింది. ఈ వీడియో ఎంతో మంది మనస్సును హత్తుకుంటుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి