ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనే మాయలో మునిగితేలుతూ ఉన్నారు జనాలు. ఎన్ని పనులున్న పక్కన పెట్టేసి ఇక కాసేపైన సోషల్ మీడియాలో ఉంటే ఆ ఆనందమే వేరు అనుకునేలాగా అందరు తీరు మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఇదే మాయలో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని తెగ ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏదో ఒకటి కొత్తగా ట్రై చేసి ఇక అందరూ దృష్టిని ఆకర్షించి ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవాలని ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారూ అని చెప్పాలి. ఇలాంటి ప్రయత్నాలలోనే కొంతమంది ఏకంగా ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.


ప్రమాదకరమైన విన్యాసాలు చేసి కొంతమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇవి చూసిన తర్వాత ఫాలోవర్స్ కోసం ఇలాంటి రిస్కులు చేయడం అవసరమా అని నెటిజన్స్  కూడా తిట్టిపోస్తూ ఉంటారూ. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి ఎంతోమంది నేటిజన్స్ విన్యాసం చేసిన వ్యక్తిని తెగ తిట్టిపోస్తూ ఉన్నారు.


 ఎందుకంటే అతను చేసిన విన్యాసం చూస్తే వీడియో చూసే వాళ్లకే వెన్నులో వణుకు పుడుతుంది. ఇక చేసిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు  ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఎత్తు పల్లాలు ఉన్న మట్టి రోడ్డుమీద ఒక కారు వస్తుంది. అయితే ఆ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే.. కారు పైన ఒక కార్డు బోర్డు.. దానిమీద ఒక యువకుడు ఆనందంగా నిలబడి ఉంటాడు. అయితే ఇంతలో కుడి వైపు నుంచి ఒక కారు అతివేగంతో యువకుడు నిలిచిన కార్డు బోర్డుని ఢీకొడుతూ వెళ్తుంది. కారు ఆ కార్డు బోర్డుని ఢీకొట్టిన సమయంలో.. యువకుడు గాల్లోకి ఎగురుతాడు. ఇక ఈ విన్యాసంలో ఏమాత్రం తేడా జరిగిన యువకుడి ప్రాణం అటు నుంచి అంటే గాల్లో కలిసిపోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: