అయితే ఈసారి అందుకు కారణం మాత్రం కరోనా వైరస్ కాదట అంతకుమించి ప్రాణాంతకమైన వైరస్ నిఫా వైరస్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా నిఫా వైరస్ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నది.కేరళ రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఈ వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందగా మరి కొంతమంది కూడా దీని బారిన పడినట్లు సమాచారం. అయితే ఈ నిఫా వైరస్ కి వ్యాక్సిన్ లేకపోవడంతో పాటు ఎలాంటి చికిత్స కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకట్టు వేయలేకపోతోందట కేరళ ప్రభుత్వం. అందుకే కేరళలో అప్పుడే ఆంక్షలు విధించారని తెలుస్తోంది.
వారం రోజులపాటు విద్యాసంస్థలు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా మూసివేశారని అంతేకాకుండా రద్దీగా ఉండే ప్రాంతాలలో షాపింగ్ మాల్స్ థియేటర్ల పైన కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చాలా చోట్ల లాక్డౌన్ కూడా విధించడంతోపాటు ఈ నెల 24వ తేదీ వరకు స్కూల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిఫా వైరస్ కోవిడ్ కన్నా చాలా ప్రమాదమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సమస్త హెచ్చరిస్తున్నది. కోవిడ్ సోకిన వారిలో మరణాల రేటు 3 పర్సెంట్ మాత్రమే ఉంటే మీ పాస్ ఓకేనా వారిలో 40-70 శాతం వరకు ఎక్కువగా ఉంటుందని రీసెర్చ్ లో తేలినట్లు తెలిపారు. ఒకవేళ ఇది ఎక్కువగా వ్యాపిస్తే లాక్ డౌన్ తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి