
కూలిన అభిమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ రూపాని కూడా ఉన్నారు . ఈ విషయాన్ని అఫీషియల్ గా ధ్రువీకరించింది గుజరాత్ ప్రభుత్వం . అంతేకాదు ఆయన అప్పటికప్పుడు అనుకోని టికెట్ బుక్ చేసుకుని తన కూతుర్ని కలవడానికి లండన్ వెళ్లాలి అని ఫిక్స్ అయ్యారట. ఈ అనుకొని ప్రయాణమే ఆయనకు ఊహించిన ప్రమాదాన్ని తీసుకొచ్చింది. కాగా ఆయన మరణం పట్ల గుజరాత్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.
ఇప్పుడు ఆయన మరణం కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. విజయ రూపాని గతంలో కూడా రెండు విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు . ఆ సమయంలో ఆయన చిన్న దెబ్బ కూడా తగలకుండా సేఫ్ గా బయటపడ్డాడు . కానీ ఈసారి మాత్రం ప్రాణాలు కోల్పోయారు . విజయ్ రూపానీ అదృష్ట సంఖ్య 1206 , నిజానికి విజయ రూపాని వాడే అన్ని వాహనాల నెంబర్లు కూడా 12 0 6 వచ్చేలా ఉంటాయి. అయితే ఈ నెంబర్ ఇప్పుడు విజయ రూపానికి యమపాసంలా మారింది.
విజయ్ రూపాని తన లక్కీ నెంబర్ అని 1206 బాగా నమ్మేవాడు . అయితే ఇప్పుడు ఆ నెంబర్ ఆయన ప్రాణాలను తీసేసింది . ఎందుకంటే విజయ్ ప్రయాణించిన విమానం నెంబర్ కూడా 1206 నే. ఇదే విమానంలో ఆయన ప్రయాణించి ఆయన ప్రాణాలను కోల్పోయారు . దీంతో మాజీ సీఎం అదృష్ట సంఖ్యనే దురదృష్టంగా మారిందా..? అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది చావులోను లక్కీ నెంబర్ వెంట తీసుకెళ్లావు నువ్వు అదృష్టవంతుడివి అంటూ పొగుడుతున్నారు . ఇది ఇలా ఉంటే ఈ విమాన ప్రమాదంలో 241 మంది స్పాట్లోనే ప్రణాలు కోల్పోయారు. కేవలం ఒక్కరు మాత్రమే బయటపడ్డాడు . ఆయన రమేష్. ఆయనను మృత్యుంజయుడు అంటూ పొగిడేస్తున్నారు జనాలు . ఆయన బ్రతకడానికి కారణం 11A సీట్ అంటూ తెగ ప్రశంసించేస్తున్నారు ..!!