
ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్లోని శిఖర్ జిల్లాలో మూలిదేవి అలియాస్ మోనా అనే ఒక కిలాడీ లేడి ని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఏకంగా రెండేళ్లుగా రాజస్థాన్ పోలీస్ అకాడమీలో ఎస్ఐగా చలామణి అయ్యింది అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మోనా అరెస్ట్ అయ్యింది. ఆమె అదే ఉంటున్న ఇంటి నుంచి ఏడు లక్షల నగదు అదే విధంగా మూడు పోలీస్ యూనిఫామ్ లు .. ఆర్ పి ఏ పరీక్ష పత్రాలు.. నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంతేకాదు యూనిఫామ్ ధరించి ఆర్పిఎఫ్ శిక్షణ కార్యక్రమాలకు హాజరవుతూ సీనియర్ అధికారులతో ఈమె ఫోటోలు దిగేది అంటూ కూడా పోలీసులు కనుక్కున్నారు .
రాజస్థాన్లోని నగర జిల్లాకు చెందిన ఓ ట్రక్కు డ్రైవర్ కుమార్తె అయిన ఈ మౌళి 2021లో రాజస్థాన్ లో ఇన్స్పెక్టర్ గా పరీక్ష రాసి ఫెయిల్ అయింది . ఆ తర్వాత నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి ఎస్సై పరీక్షల్లో తాను పాస్ అయ్యాను అని టాప్ ర్యాంకు తెచ్చుకున్నాను అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఆ తర్వాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వాట్సప్ గ్రూపుల్లో చేరి రాజస్థాన్ పోలీస్ అకాడమీలో పోలీస్ స్పోర్ట్స్ కోటా కింద మునుపటి బ్యాచ్ అభ్యర్థిగా అందరినీ పరిచయం చేసుకుని తన మాయమాటలతో నమ్మించింది . అలాగే తన మాయమాటలతో ఫేక్ సర్టిఫికెట్లతో నెట్టుకొచ్చింది . కొంతమంది ట్రైనీలకు ఈమెపై అనుమానం రావడంతో ఎంక్వైరీ చేయగా సీనియర్ అధికారులు దృష్టికి వెళ్ళగా ఆ తర్వాత అసలు విషయం బయటపడింది . అమ్మడు మొత్తం కిలాడి లేడీ అని అందరినీ మోసం చేసింది అన్న విషయం బయటపడింది. గత రెండేళ్లుగా పరారీలో ఉన్న ఈ మూలిదేవిని ఎట్టకేలకు పోలీసులలో అరెస్ట్ చేశారు. దీంతో ఈమె ఆటలకు పుల్ స్టాప్ పడిన్నట్లైంది..!