అనుభవం లేని చదువుకన్నా..చదువులేని అనుభవం గొప్పది అన్నారు పెద్దలు. అందుకే జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని ఒక్కొక్క మెట్టుగా చేసుకొని ప్రయత్నించాలి. అపుడే విజయం మీకు సిద్ధిస్తుంది. ప్రతి అనుభవం ఒక జ్ఞాపకమే, దాన్ని సరైన సమయంలో గుర్తుచేసుకొని పాటించిన వాడే ప్రజ్ఞా శాలి అనిపించుకుంటాడు. మనం చేయలేము అనుకుంటే ఏ పనిని పూర్తి చేయలేము. దేనినీ సాధించలేము. మన ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండకూడదు. ఫలితం గురించి ఆలోచించకుండా శక్తి మేర ప్రయత్నిస్తే విజయం సొంతం అవుతుంది.
ఒకవేళ ఆ ప్రయత్నంలో ఓడిపోతే మీకు పోయేది ఏమీ ఉండదు, దాని వలన ఒక అనుభవం వస్తుంది. అందులో జరిగిన పొరపాటును మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడతారు. ఆ అనుభవం గెలుపును అందుకునేందుకు సాధనంగా మారుతుంది. అంతే కానీ ఎటువంటిప్రయత్నం లేకుండా గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అని అంటే ఫలితం శూన్యం అని గ్రహించండి. మీ జీవితంలో ఉన్న అనుభవాలన్నింటినీ ఉపయోగించి మీరు అనుకున్న దానిని సాధించడానికి గట్టిగా ప్రయత్నించండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి