
సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి చిన్న వయస్సులోనే కెరీర్ పరంగా సక్సెస్ సాధించి సొంతంగా కంపెనీలను స్థాపించి వాటిని సైతం విజయవంతంగా రన్ చేయడం సాధారణమైన విషయం కాకపోయినా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తన సక్సెస్ స్టోరీతో కోటిరెడ్డి సరిపల్లి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. స్వయంకృషితో సక్సెస్ సాధించిన కోటిరెడ్డి సరిపల్లి మానవత్వానికి మరో రూపం అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో టెక్నాలజీ సేవలు అందించే కంపెనీలను స్థాపించిన కోటిరెడ్డి తన సంపాదనలో ఏకంగా 33 శాతం సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం జనార్ధన పురంకు చెందిన కోటిరెడ్డి వేల కుటుంబాల్లో వెలుగులు నింపుతూ తన అరుదైన వ్యక్తిత్వంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. సేవా ఫౌండేషన్ పేరుతో పేద విద్యార్థులకు, వృద్ధులకు సేవలందించడంలో పాటు జనార్ధనపురం, నందివాడల్లోని పాఠశాలలను దత్తత తీసుకుని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు.
ప్రతిభ, పట్టుదలతో కష్టపడితే సక్సెస్ సాధించడం సాధ్యమేనని ఆయన సక్సెస్ స్టోరీ వింటే అర్థమవుతుంది. ఈ గుడివాడ శ్రీమంతుడు ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీల ద్వారా కోట్ల సంఖ్యలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ మనసున్న శ్రీమంతుడు చేసిన సహాయాలను చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. 750 రూపాయల వేతనంతో కోటిరెడ్డి ప్రస్థానం మొదలు కాగా నేడు ఆయన కంపెనీల టర్నోవర్ 1000 కోట్ల రూపాయలకు చేరిందంటే ఈ సక్సెస్ లో ఆయన కష్టం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
పినాకిల్ బ్లుమ్స్ ద్వారా పరిష్కారం బుద్ధి మాంద్యంతో బాధ పడుతున్న పిల్లలకు మెరుగైన వైద్య చికిత్సలు అందేలా చేస్తున్నారు. కోటిరెడ్డి ప్రస్థానం ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. కోటిరెడ్డి సరిపల్లి పదేళ్ల పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం చేసి దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో సొంతంగా కంపెనీలను స్థాపించి కెరీర్ పరంగా ఎదిగారు.