ప్రెగ్నెన్సీ టెస్ట్‌ను వెంటవెంటనే, సరైన విరామం తీసుకోకుండా చేయించుకోవడం వల్ల ఫలితాలు సరిగా రాకపోవచ్చు. టెస్ట్ కిట్ ప్యాకేజీపై ఇచ్చిన సూచనలు పాటిస్తూ, సరైన తేదీలో పరీక్షించుకోవాలి. ఫలితం మళ్లీ నెగెటివ్‌గా వస్తే, కొన్ని రోజుల విరామం తర్వాత టెస్ట్ చేసుకోవాలి. గడువు ముగిసిన, విరిగిపోయిన టెస్టింగ్ కిట్లతో ప్రెగ్నెన్సీ పరీక్షలు చేసుకుంటే సరైన ఫలితం రాకపోవచ్చు.