ఆడవారికి ఎంతో ఇష్టమైన వాటిలో ఒకటి గోరింటాకు.ప్రతీ ఒక్కరూ ఏ పండగైన, పేరంటమైన సరే ముందుగా గుర్తొచేది గోరింటాకు. ఆడవారికి గోరింటాకు ఆకుని రుబ్బుకొని పెట్టుకోవటం అంటే చాలా ఇష్టం.ఇప్పుడు ఇంకా ఈజీగా ఉండేలా మెహందీ కోన్స్ కూడా వచ్చాయి. మనకి నచ్చిన స్టైల్ లో నచ్చిన విధంగా పెట్టుకుంటాం.ప్రతీ ఒక్కరు ఇప్పుడు గోరింటాకు కన్నా మెహందీని ఎక్కువగా ఇష్ట పడతారు ఎందుకంటే ఇద్ది పెట్టుకున్న కొద్ది సేపటికే త్వరగా ఆరిపోయి మంచిగా పండుతుంది.కానీ గోరింటాకుని రుబ్బుకో కుండా కొత్త రకమైన పద్ధతిలో ఎలా పెట్టూకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.



మనం ముందుగా గోరింటాకు ఆకులని కోసుకుని పక్కన పెట్టూకోవాలి.ఇప్పుడు చేతికి కొంచెం ముందుగా వ్యాజిలిన్  రాసుకోవాలి.ఇది రాసిన తరువాత దీని మీద వోలినీ స్ప్రే కొట్టుకొని దాని మీద గోరింటాకు ఆకులను మనకి నచ్చిన రీతిలో మనకి నచ్చిన డిజైన్ లో పెట్టుకొని దాని మీద మళ్ళీ వోలినీ స్ప్రే కొట్టి ఒక గంట సేపు ఉంచుకోవాలి. గంట తరువాత అవి రంగు మారతాయి వడపడినట్టు అలా అయ్యాక ఆకులని తీసేసి చూడండి చక్కగా ఎర్రగా పండి మంచిగా ఉంటుంది.


గోరింటాకు వల్ల కలిగే లాభాలు:
గోరింటాకు అంటే అదేదో ఆడవారికి సంభందించిందని అనుకోకండి. గోరింటాకు ఒక ఔషదం. గోరింటాకును రుబ్బి పెట్టుకోవటం వలన గోర్లు పుచ్చకుండా ఉంటాయి. అర చేతిలోను అరికాళ్ళ లోను పెట్టుకోవటం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ శరీరంలో ఇతర భాగాలకు సంభందించిన నాడులు ఉంటాయి.ఆయుర్వేధంలో కొన్ని పద్దతుల ద్వారా గోరింటాకును ఔషదంలా తీసుకోవడం వలన అల్సర్ మరియు మొదలైన రోగాలను నయం చేయడమే కాకుండా పేగులను శుభ్రపరుస్తుందని ఆయుర్వేధ గ్రంధాలలో ఉంది.

శరీరానికి గాయమై రక్తంకారుతున్న సమయంలో గోరింటాకు నూనెనూ గాయమైన ప్రదేశంలో రాస్తే కాసేపటిలోనే విడిపోయిన చర్మం కలిసిపోయి గాయం అతి త్వరగా మాయమైపోతుంది.గోరింట చెట్టుకి కోసిన ఆకులలోనే ఔషద గుణాలు ఉం టాయి అంతే కాని బయట దొరికే మెహందీలో,హెన్నాలో ఎటువంటి ఔషద గుణాలు ఉండవు.




మరింత సమాచారం తెలుసుకోండి: