కనీసం 7 గంటల సేపు గాఢ నిద్ర చాలా అవసరం.అప్పుడే తల్లికి బిడ్డకు ఇద్దరికి మంచిది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీ సాధ్యమైనంత వరకు ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. ఎందుకంటే గర్భిణిగా ఉన్నప్పుడు బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఉప్పును సాధ్యమైనంత వరకు తక్కువ తీసుకోవాలి.
అంతేకాకుండా టీ, కాఫీలకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. అందులో ఎక్కువగా కెఫిన్ ఉంటుంది. అది బిడ్డ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అలాగే రాగిజావ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.రాగిజావ వల్ల రక్త శాతం ఎక్కువ అవుతుంది. అలాగే ఒక్కోసారి ఫంక్షన్స్ కి , వేరే ప్రదేశాలకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తినవలసి వస్తే వాటిలో మనకు సౌలభ్యంగా ఉండేవాటిని ఎంచుకొని మరీ తినాలి. సాధ్యమైనంత వరకు బయట తినటానికి నిరాకరించడమే మంచిది. అలాగే కూరగాయలను, పండ్లను మార్కెట్ నుండి తెచ్చిన తరువాత గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి 15 నిమిషాలపాటు ఉంచండి. ఆ తరువాత ఆ నీటిని పారపోసి మరలా వాటిని కడిగి పెట్టుకోండి. మరొక సారి కడగటం వల్ల చాలా వరకు హానికరమైన రసాయనాలను తొలగించవచ్చు. గర్భిణీ స్త్రీలు నీరు త్రాగటం చాలా మంచిది . కనీసం రోజుకు 5 లీటర్లు నీరు అయినా త్రాగాలి. వీలైతే చల్లని నీరు కన్నా గోరు వెచ్చని నీరు ఆరోగ్యానికి అత్యంత మంచిది. ఉదయాన్నే ఒక లీటరు, గంట తరువాత ఒక లీటరు ఖచ్చితంగా త్రాగండి. రాత్రి 7.00 గంటల లోపు లేదా ఖచ్చితంగా 8.00 గంటల లోపు ఆహారం తీసుకోండి. తిన్న తరువాత కనీసం ఒక అరగంట అయిన కచ్చితంగా నడవండి. గర్భిణీ స్త్రీలు పూరీలు, మైసూర్ బోండా మొదలైన టువంటిది నెలకు ఒక్కసారి అయితే పర్వాలేదు.
తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారాన్ని, శాఖాహారాన్ని రెండింటినీ సమపాళ్ళల్లో తీసుకోవాలి. బత్తాయి, నారింజ, కమలా పండ్ల వంటివి తినేటప్పుడు పిప్పి ఊసేయకుండా తినటం మంచిది. వీలయినంత వరకు కాయగూరల పైన తొక్కు తీయకుండా వండుకోవాలి. ఆహార పదార్థాల పైన ఈగలు, క్రిమికీటకాదులు వాలకుండా చూసుకోవాలి. కాయగూరలను పండ్లను నీళ్ళతో కడిగిన తర్వాతనే ఆహారంగా తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ వేడిపాలు తాగితే చక్కగా నిద్ర పడుతుంది.. పండంటి బిడ్డ కావలంటే పైన తెలిపినవి పాటించండి.. !
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి