గర్భిణిగా ఉన్న సమయంలో ఇంటికి వచ్చే అతిథులు స్వీట్స్ పిండి వంటలు ఎక్కువగా తెచ్చి ఇస్తూ ఉంటారు. అవి ఒకటో రెండో తిన్న పర్వాలేదు కానీ వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. అవి ఎక్కువగా తినడం వలన శరీరంలో కొవ్వు పెరిగి ప్రెగ్నెన్సీ తరువాత బరువు తగ్గడం కష్టంగా మారుతుంది. అయితే శరీరానికి సరిపడినంత నీళ్లు తాగడం వలన హైడ్రేటెడ్ గాను ఆరోగ్యంగా కూడా ఉంటారు. తినడానికి ఒక అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం వలన అది మిమ్మల్ని ఎక్కువ ఆహారం తినకుండా కాపాడుతుంది. స్వీట్ లాంటి పదార్థాలు తినాలి అనే కోరిక తగ్గుతుంది .గర్భదారణ కారణంగా మీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి.
ఇక మీ శరీరం వాటికి అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుంది. నిద్రపోవడం అనేది మీ శరీరంలో జరిగే మార్పులు కి మంచి సమాధానంగా ఉంటుంది. పడుకునేటప్పుడు మరి చీకటిగా ఉన్న ప్రదేశం లో పడుకోండి. మీరు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర పోవడానికి కేటాయించుకోవాలి. మధ్యాహ్నం వేళ మీకు సమయం ఉంటే కొంచెం సేపు నిద్రపోండి.ప్రెగ్నెంట్ కదా అని ఎప్పుడు విశ్రాంతి లోనే ఉండకూడదు. అప్పుడప్పుడు వ్యాయామం కూడా చేస్తుండాలి. ముందుగా స్ట్రెట్చ్స్ తో మొదలు పెట్టి తరువాత మెల్ల మెల్లగా కొంచెం క్లిష్టమైన వ్యాయామాలు చేస్తుండండి. ఈ సమయంలో నిపుణుల సహాయం పొంది జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి