కొన్ని ప్రేమకథలు దశాబ్దాలు,శతాబ్దాలు గడిచినా కూడా అమరం గా నిలిచిపోతాయి. రోమియో జూలియట్, లైలామజ్ను, దేవదాసు పార్వతి..  వీరి ప్రేమ కథలు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కావ్యాలు. వీరిలాగే ఎంతో మంది ప్రేమ కథలు చరిత్ర పుటల్లో మరుగున పడ్డాయి. వారిలో చంద్ర గుప్త మౌర్య మరియు హెలెనా ల ప్రేమకథ కూడా ఒకటి. క్రీస్తుపూర్వం 313 వ సంవత్సరంలో చంద్రగుప్త మౌర్యుడు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. మైసూర్ తమిళనాడు కాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు నేపాల్ భూటాన్ లను కూడా జయించాడు.

క్రీస్తు పూర్వం 305 వ సంవత్సరంలో గ్రీకు రాజు సెలేయుకొస్ నికాటర్ పంజాబ్ పై దాడి చేస్తూ చంద్రగుప్త మౌర్యుడునపై యుద్ధానికి వచ్చాడు. కానీ చంద్రగుప్తుడి ఎదుట నిలవలేకపోయాడు. ఆ యుద్ధంలో ఓడిపోయాడు ఓడిపోయినందుకు తన ఆధీనంలో ఉన్న పలు ప్రాంతాలను చంద్రగుప్త మౌర్యుడుకి ఇచ్చాడు నికోటర్. పర్షియా లోని పలు రాష్ట్రాలను చంద్రగుప్తుడుకి ఇచ్చాడు.  వీటితోపాటు చంద్రగుప్తునికి తన కుమార్తె హెలెనా ను కూడా ఇచ్చి వివాహం చేశాడు నికొటర్.అప్పటికి చంద్రగుప్తుడు వయసు 40 ఏళ్లు. 

హెలెనా వయసు 15 నుంచి 17 ఏళ్ళు ఉంటుంది. అయినప్పటికీ చంద్రగుప్తుడు వివాహం చేసుకొని పాటలీపుత్రంలో అంత పురానికి తీసుకువస్తాడు. ఆమె వెంట ఆమె తల్లిదండ్రులు సోదరుడు కూడా వచ్చి కొన్ని రోజుల పాటు అక్కడే గడుపుతారు. కూతుర్ని ఇచ్చి వివాహం చేసినందుకుగాను చంద్రగుప్తుడు 500 ఏనుగులు, టన్నుల కొద్ది బంగారు ఆభరణాలను నికొటర్ కు ఇస్తాడు. అయితే హెలెనా ను చూసి ప్రేమించిన చంద్రగుప్తుడు స్వయంగా నికోటార్ తో యుద్ధానికి దిగాడు అని తనంతటతానుగా చంద్రగుప్తుడు తో యుద్ధానికి నికొటార్ రాలేదని కొందరు చెబుతారు. దీనికి సంబంధించిన ఆధారాలు చరిత్రలో ఎక్కడా లేవు. చంద్రగుప్తుడి భార్య దురధర మహారాణి మరణించి అప్పటికే చాలా కాలం అవుతుంది. దీంతో చంద్రగుప్తుడు హెలెనా ను మహారాణిగా చేయాలనుకుంటాడు. విదేశీ మహిళను మహారాణిగా ప్రకటించకూడదని చెబుతాడు చాణక్యుడు అందుకే చంద్రగుప్తుడు ఆపని మానుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: