అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలు చాలా మంచివి. బిడ్డకు కావలసిన అన్నీ పొషకాలు అందుతాయని నిపుణులు అంటున్నారు. అయితే కొంతమంది తల్లులకు పాలు అనేవి ఉండవు. వాటికి డాక్టర్ల దగ్గరకు వెళతారు.. వాళ్ళు ఇచ్చే మందులు వెసుకున్నంత వరకూ పాలకు ఎటువంటి సమస్య ఉండదు. తర్వాత మళ్ళీ అదే మామూలు.. అలాంటి వాళ్ళు ఇంటి చిట్కాలను ఉపయొగించి ఎలా పాల ఉత్పత్తిని పెంచుకొవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

దాల్చిన చెక్క..
దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల శరీరానికి ఎంత మంచిదొ అందరికి తెలిసిన విషయం.. ఎన్నో అనారొగ్య సమస్యలకు ఇది చెక్ పెడుతోంది. వైద్య నిపునులు కూడా అదే సలహా ఇస్తున్నారు.. అయితే బాలింతలకు ఈ దాల్చిన చెక్క మంచిది. పాల ఉత్పత్తిని పెంచుకునేందుకు ఇది సహాయపడతాయి.
వీటితో టీ చేసుకొని తల్లులు తాగడం వల్ల పాలు పెరుగుతాయని చెబుతున్నారు.

అల్లం,వెల్లుల్లి..
అల్లం వెల్లుల్లి తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉందన్న విషయం తెలిసిందే.రోగనిరోధక శక్తీ పెరగడానికి ఇది సహాయపడతాయి.బిడ్డ పుట్టిన తర్వాత ఇవి తీసుకొవాలని నిపుణులు అంటున్నారు. వీటి వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.

బాదం.. 
బాదం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయి..పాలల్లొ బాదమ్ వేసుకొని కనుక పాలు తాగితే తల్లులకు చాలా మంచిది.పది బాదమ్ పప్పులను తీసుకొని రాత్రంతా నానబెట్టి ఉదయం తొక్క తీసి పేస్ట్ లా చేసి వేడి పాల ల్లో వేసుకొని తాగితే పాలు పడతాయని పెద్దలు చెబుతున్నారు.

జీలకర్ర.. 
జీలకర్ర అధిక బరువును తగ్గించడంతోపాటు ఎన్నో సమస్యలకు చెక్ పెడుతోంది.తల్లులు రాత్రి పడుకునే ముందు ఒక స్పూను జీలకర్ర, కొద్దిగా పంచదార కలిపి ఒక గ్లాసు వేడి పాలతో తాగితే పాలు బాగా పెరుగుతాయి. 

ఇవే కాకుండా వాము, సోపు తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. వీటితో పాటుగా మంచి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, కురగాయలను ఎక్కువగా తీసుకోవడం మేలు..అంతే కాకుండా ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. మంచి నిద్ర ఉండాలి.. ఎక్కువ ఆలోచనలు బిడ్డ గురించి ఆలోచనలు వున్నా పాలు అనేవి బిడ్డకు సరిపోతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: