జ్యేష్టమాసము
తిథి: బ. సప్తమి మ2.01
నక్షత్రం: ఉత్తరాభాద్ర తె3.49
యోగం: సౌభాగ్య ఉ10.47
కరణం బవ మ2.01 బాలువ రా2.40
వర్జ్యం : ప మ12.22-2.05కు
దుర్ముహూర్తం : ఉ10.10-11.02కు తిరిగి మ3.22–4.15కు
అమృతకాలం : రా10.40-12.23కు
సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం: 6.55
మేష రాశి
సాంఘిక పరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలమైన రోజు.
ప్రమోషన్లు, వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు ఏర్పడతాయి.
భార్యా పిల్లలతో చాలా ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి.
వృషభ రాశి
అన్ని విషయాల్లోనూ అనుకూల వాతావరణం.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు.
దీర్ఘకాలిక లక్ష్యాలు, గమ్యాలకు సంబంధించి గురువుల ఆశీస్సులతో ముందుకు సాగండి.
సంఘంలో మీ గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి.
మతపరమైన అంశాల అవగాహన పెంచుకోవడానికి ఉపయుక్తమైన సమయం.
మిధున రాశి
జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు తీరి ఆనందకరమైన వాతావరణం.
అన్ని విషయాలలో కూడా అభివృద్ధి ఉంది.
వృత్తి ఉద్యోగాల్లో కలిసి వచ్చే అంశాలు చోటు చేసుకుంటాయి.
పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి
కర్కాటక రాశి
క్రయ విక్రయాలు, స్థిర చరాస్తుల కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాలు అనుకూలము.
వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల మీ దృక్పథం మారుతుంది.
సింహ రాశి
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఏర్పడే అవకాశం.
వ్యాపార విస్తరణకు కావలసిన కొత్త రుణ ప్రయత్నాలు కలిసి రావు.
ఆరోగ్య విషయంలో వైద్య సహాయం పొందాల్సి రావచ్చు.
వివాదాలకు దూరంగా ఉండండి.
కన్య రాశి
ఖరీదైన వస్తువుల్ని బహుమతులుగా పొందుతారు.
ఆదాయ మార్గాల్లో అభివృద్ధి ఉంది.
మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది.
బంధుమిత్రులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు.
తులారాశి
ఆర్థిక పరమైన అంశాలు ఇబ్బంది పెడతాయి.
వృత్తి వ్యాపారాలలో కావాల్సిన సహకారం లభించదు.
మానసిక ప్రశాంతతను కోల్పోతారు.
అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టం.
వృశ్చిక రాశి
నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి.
సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
విదేశయాన ప్రయత్నాలు, విద్యా విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు.
భవిష్యత్ కు సంబంధించి తీసుకునే నిర్ణయాలు కలసి వస్తాయి.
ధనస్సు రాశి
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం కాదు.
క్రయ విక్రయాలు, స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి అడుగులు ముందుకు పడవు.
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
అకాల నిద్ర, అకాల భోజనము, విశ్రాంతి ఉండదు.
మకర రాశి
వ్యాపార పరంగా పూర్తి అనుకూలత.
సాంఘిక పరమైన విషయాల్లో నూతన పరిచయాలు కలిసివస్తాయి.
దీర్ఘ కాలిక రుణాలనుండి ఉపశమనం. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
ఆర్థికంగా నూతన అవకాశాలు లభిస్తాయి.
కుంభరాశి
నూతన పెట్టుబడులు లభిస్తాయి.
ముఖ్యమైన విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది.
అప్రయత్నంగానే కొన్ని పనులు పూర్తి అవుతాయి.
విందు వినోదాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య క్షేత్రాలు సందర్శించే అవకాశం.
మీనరాశి
శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. సాంఘిక అంశాలు కలిసివస్తాయి.
వృత్తి ఉద్యోగ విషయాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో అభివృద్ధికరమైన పరిస్థితులు.
సంతోషం. దుఃఖం.....
దుఃఖానికి అసలు కారణం సంతోషానికి ఎక్కువ విలువ నివ్వడమే.. మనం సంతోషంగా ఉన్న మనసును, దుఃఖంగా ఉన్న మనసును మాత్రమే చూడటానికి అలవాటు పడ్డాం. అవి రెండూ లేని మనసు, రోజులో అధిక సమయం ఉంటున్నా దానికి విలువనివ్వడం లేదు.
దుఃఖానికి అసలు కారణం సంతోషానికి ఎక్కువ విలువ నివ్వడమే. సంతోషం కూడా మన సహజ స్వరూపంలో లేదని తెలిస్తే సంతోషంగా ఉండాలనే కాంక్ష పోతుంది. విచారణ మార్గంలో మనసును గమనించడం ద్వారా మనసు ఏ అనుభవాన్ని తనతో అంటిపెట్టుకుని ఉండటం లేదని తెలుస్తుంది.
మనసు దేన్నైనా జ్ఞాపకంగా తప్ప ఎంత గొప్ప అనుభవమైనా తనలో నిల్వ చేసుకోలేదు. సామాన్యుడికైనా, మాన్యుడికైనా సంతోషం, దుఃఖం సహజం. కానీ అవి అశాశ్వతమైనవని తెలియడమే ఆనందానికి మార్గం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి