బైక్ రేసింగ్ లో పాల్గొనే యువత మార్కెట్ లో రేసింగ్ కు సంబందించిన బైకు లను వెతుకుతుంటారు... ఏ కంపెనీ బెస్ట్ అనే ఆలోచనలు అందరిలోనూ మెదులుతున్నాయి..అయితే రేసింగ్ కోసం సుజుకీ కంపెనీ కొత్త బైకు ను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది.ఆ బైక్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా ముందు వరుసలో ఉంటుంది. తాజాగా ఈ కంపెనీ సరికొత్త మోటార్ సైకిల్ భారత విపణిలో లాంచ్ అయింది. అదే సుజుకీ వీ-స్ట్రోమ్ 650 ఎక్స్ టీ. బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లో విడుదల చేసిన ఈ మోటార్ సైకిల్ఆకట్టుకుంటోంది.



ఇక ఈ బైకు షో రూం లో రేట్ల విషయానికొస్తే..రూ.8.84 లక్షలు అట.. త్రీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టం, వివిధ స్థాయిల్లో ట్రాక్షన్ కంట్రోల్ తో పాటు ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, స్విచ్ గేర్ లాంటి ఆప్షన్లు ఉన్నాయి. అంతేకాకుండా సస్పెన్షన్ సెటప్ దగ్గరకొస్తే 43 ఎంఎం ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంది. వీటితో పోలిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ మోటార్ సైకిల్ సుజుకీ ఈజీ స్టార్ట్ సిస్టం స్ట్రెస్ ఫ్రీతో పాటు పుష్ బటన్ తో స్టార్ట్ అవుతుంది.. వీటితో పాటుగా ఎన్నో ఫీచర్లు కూడా ఇందులో ఉంది..



మొత్తానికి రేసింగ్ ప్రియులకు ఈ బైకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది..స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ మోటార్ సైకిల్ సుజుకీ ఈజీ స్టార్ట్ సిస్టం స్ట్రెస్ ఫ్రీతో పాటు పుష్ బటన్ తో స్టార్ట్ అవుతుంది...మొత్తానికి ఇది ఈ బండి కున్న ప్రత్యేకతలు.. వీటి వల్ల ఈ బైక్ మార్కెట్ లోకి లాంఛ్ చేశారు.. కేవలం కొద్ది గంటల్లోనే భారీగా సేల్స్ ను సొంతం చేసుకుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: