భారత్ లో హవా కొనసాగిస్తున్న ఇసుజు ఇండియా ,తన ప్యాసింజర్ వాహనశ్రేణిను ఇంకాస్త అప్డేట్ చేసి మార్కెట్ లోకి విడుదల చేసింది. అందులో భాగంగానే కంపెనీ తన ఎమ్ యు - ఎక్స్ బీ ఎస్ 6 ప్రీమియం ఎస్ యూవీ ని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర ఏకంగా రూ.33.23 లక్షల వద్ద ప్రారంభమవుతుంది.

ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి 4X2AT ఒక మోడల్, మరొక మోడల్ 4X4AT లలో లభిస్తుంది. ఇందు లో టాప్-స్పెక్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.33.19 లక్షల వరకు ఉంటుంది. ఇప్పుడు కొత్త మోడల్ కారు యొక్క బుకింగ్స్ భారతదేశం అంతటా స్వీకరించ బడుతున్నాయి.

Mx Bs 6 మోడల్ లో అతిపెద్ద మార్పు ఏంటంటే ఇందులో అప్డేట్ చేసిన బిఎస్ 6 ఇంజన్, అంతే కాకుండా బి ఎస్ 4 మోడల్ కు శక్తినిచ్చే అతిపెద్ద 3.0-లీటర్ ల డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది.

ఈ ఇంజన్ గరిష్టంగా 174 బి హెచ్ సి మరియు 380 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇండియన్ ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పాటు, ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టం మరియు లో రేంజ్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది. ఇది అప్డేట్ చేసిన కొత్త పవర్ ట్రైన్ కలిగి ఉంటుంది.

Mu-x suv యొక్క ఇంటీరియర్ గమనించినట్లయితే, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే కు మద్దతుగా 7 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఇందులోనే రియర్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి.


Mu-x BS6 SUV బ్రాండ్ యొక్క లైనప్ లోని ఇతర మోడల్స్ తో పోలిస్తే, తక్కువ టార్క్ ను  ఉత్పత్తి చేస్తుంది. కానీ ఇది మంచి రహదారి సామర్థ్యాన్ని కలిగి ఉండడం వల్ల, ఎటువంటి రోడ్డు లో  అయినా ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: