ఇండియాలో రోజు రోజుకి బైకులకు డిమాండ్ పెరుగుతోంది.డిమాండ్ కి తగ్గట్టే దేశీయ మార్కెట్లో బైక్ కంపెనిస్ కూడా అప్డేటెడ్ బైక్స్ ప్రవేశపెడుతున్నాయి.ఇక ఈ మధ్య కాలంలో ఇండియన్ మార్కెట్లో పవర్‌ఫుల్ బైక్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. కస్టమర్ల అనుభూతికి అనుకూలంగా చాలా రకాల బైకులు అందుబాటులోకి వచ్చాయి.ఇండియన్ మార్కెట్లో పవర్‌ఫుల్ బైక్‌లు చాలా ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో 2 లక్షల కన్నా తక్కువ ధరకు అమ్ముడవుతున్న పవర్‌ఫుల్ బైక్‌ల గురించి తెలుసుకోండి.

ఇక ముందుగా బజాజ్ డామినార్ 250 బైక్ గురించి చెప్పుకోవాలి.ఇది ఈ విభాగంలో ఉత్తమమైన బైక్. ఇక ఈ పవర్ ఫుల్ బజాజ్ డామినార్ 250 బైక్ ధర రూ. 1.71 లక్షలు. ఇక ఈ బైక్ స్పర్టియర్ డిజైన్‌తో ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది. ఇక బజాజ్ డామినార్ 250 బైక్, డామినార్ 400 బైక్ లాగానే ఉంటుంది.


ఇక సుజుకి క్వార్టర్ లీటర్ జిక్సర్ ఎస్ఎఫ్ 250 కూడా అదిరిపోయే మరో పవర్ ఫుల్ బైక్. ఇక ఈ సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 ధర విషయానికి వస్తే 1.78 లక్షలు వుంది.ఇక ఈ బైక్ కొత్తగా రూపొందించిన ట్యాంక్‌లో ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్‌లతో ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకుంటుంది.

కెటిఎమ్ డ్యూక్ 200 ఇండియాలో విపరీతమైన ప్రజాదరణ పొందింది బైక్స్ లో ఒకటి.ఇక ఈ బైక్ ధర విషయానికి వస్తే 1.83 లక్షలుగా మార్కెట్లో అందుబాటులో వుంది. ఇక దీనిలో 199 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 24.6 బిహెచ్‌పి శక్తి అలాగే 19.2 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్ చూడటానికి చాలా ఆందంగా ఉంటుంది.ఇక అంతే కాకుండా ఇది ఎంతో కంఫర్ట్ గా కూడా ఉంటుంది.

హస్క్వర్నా స్వర్ట్‌పిలీన్ 250 బైక్‌ నియో-రెట్రో స్క్రాంబ్లర్ డిజైన్ కలిగి ఉంది.ఇక ఇది విట్‌పిలీన్ 250 బైక్ కేఫ్‌లో రేసర్ స్టైలింగ్ లో అద్భుతంగా ఉంటుంది. ఇక ఎక్స్ షోరూమ్ ప్రకారం దీని ధర వచ్చేసి రూ. 1.99 లక్షలుగా వుంది.

2 లక్షల రూపాయల కంటే తక్కువ ధర కలిగిన మోటార్ సైకిల్ రేంజిలో జావా పెరాక్ కూడా మంచి ప్రజాదరణ పొందిన బైక్ అనే చెప్పాలి. ఇది కూడా తక్కువ ధరతో మీరు కొనుగోలు చేయగల మంచి స్టైలిష్ బైక్. ఇక ఎక్స్-షోరూమ్ ప్రకారం ఈ బైక్ ధర వచ్చేసి రూ. 1.97 లక్షలుగా వుంది.ఇక ఈ స్టైలిష్ బైక్‌లో పొడవైన వీల్‌బేస్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: