ఇక ఇండియా గత సంవత్సరం జులైలో అమ్మకాల పరంగా 25.8 శాతం వృద్ధిని సాధించి, ఇండియా మార్కెట్లో 48,042 యూనిట్ల కార్లను అమ్మింది.కాగా, ఇప్పుడు ఇప్పుడు ఆగష్టు నెలలో కూడా ఇదే జోరును కొనసాగించడానికి కంపెనీ తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఆ వివరాలేంటో తెలుసుకోండి.హ్యుందాయ్ అమ్ముతున్న కాంపాక్ట్ సెడాన్ ఔరాపై కంపెనీ ఈ నెలలో మొత్తం రూ.50,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.ఇక వీటిలో రూ.35,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్సేంజ్ బోనస్ ఇంకా రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి. అలాగే మరోవైపు, ఇందులోని సిఎన్‌‌జి వేరియంట్‌లపై కంపెనీ రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇంకా రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తోంది.

ఇక ఆగస్ట్ నెలలో ఈ హ్యాచ్‌బ్యాక్‌ను కొనుక్కునే కస్టమర్లు గరిష్టంగా రూ.40,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ఇందులో రూ.25,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇంకా రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి. ఇందులో కూడా సిఎన్‌‌జి వేరియంట్‌లపై కంపెనీ రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇంకా రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లను కంపెనీ అందిస్తోంది.అలాగే హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ కార్ హ్యాచ్‌బ్యాక్ 'శాంత్రో'పై ఈ నెలలో కంపెనీ మొత్తం రూ.40,000 వరకు కూడా మంచి ప్రయోజనాలను అందిస్తోంది. ఇక ఇందులో రూ.25,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్సేంజ్ బోనస్ ఇంకా రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. ఈ మోడల్‌లోని ఎరా ఇంకా సిఎన్‌జి వేరియంట్‌లపై కంపెనీ రూ.10,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఇంకా రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లను అందిస్తోంది.

హ్యుందాయ్  ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 పై కంపెనీ ఈ నెలలో రూ.40,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో టర్బో ఐఎమ్‌టి వేరియంట్‌పై రూ.25,000 క్యాష్‌బ్యాక్, ఇంకా రూ.10,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ అలాగే రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తున్నారు. అలాగే, ఇందులోని డీజిల్ వేరియంట్‌లపై రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇంకా రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఈజీగా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: