ఫేమస్ జర్మన్ లగ్జరీ కార్ తయారీ కంపెనీ 'మెర్సిడెస్ బెంజ్' ఇండియన్ మార్కెట్లో తన 'ఈక్యూఎస్ 580 4మ్యాటిక్'అనే కొత్త ఎలక్ట్రిక్ కార్ విడుదల చేసింది.ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ. 1.55 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త 'మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మ్యాటిక్' అనేది స్థానికంగా తయారుచేయబడిన మొట్ట మొదటి బ్రాండ్ మోడల్. కావున ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 25 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.ఇక కొత్త మెర్సిడెస్ బెంజ్ EQS 580 4మ్యాటిక్ అద్భుతమైన డిజైన్ ని కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు  ఫ్రంట్ బంపర్‌లు ఇప్పుడు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉన్నాయి. ఇందులో బ్లాంక్డ్-అవుట్ గ్రిల్ మధ్యలో బ్రాండ్ లోగో వంటివి ఉన్నాయి.


సైడ్ ప్రొఫైల్ 5 స్పోక్ డిజైన్ కలిగి 20 ఇంచెస్ వీల్స్ పొందుతాయి.మెర్సిడెస్ బెంజ్ EQS 580 4మ్యాటిక్ పొడవు 5,126 మిమీ వరకు ఉంటుంది. కావున ఇది దాని S-క్లాస్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే వీల్‌బేస్‌ దాదాపు సమానంగా ఉంటుంది. మొత్తం మీద ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది.మెర్సిడెస్ బెంజ్ EQS 580 4మ్యాటిక్  ఇంటీరియర్ విషయానికి వస్తే,ఇందులో మూడు స్క్రీన్స్ చూడవచ్చు. ఇందులో కూడా డ్రైవర్ ఇంకా ప్యాసింజర్ ముందు ఉన్న స్క్రీన్స్ ఒక్కొక్కటి 12.3 ఇంచెస్ ఉంటుంది.అయితే మధ్యలో 17.7 ఇంచెస్ ఉంటుంది. ఇది టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.ఇందులో హెడ్స్-అప్ డిస్‌ప్లే, ముందు ప్రయాణికుల కోసం మసాజ్ ఫంక్షన్ సీట్లు, బర్మెస్టర్ 3D సౌండ్ సిస్టమ్, ఎయిర్ ఫిల్ట్రేషన్ ఇంకా వెనుక ఉండే ప్యాసింజర్ల కోసం MBUX టాబ్లెట్‌ వంటివి కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద ఇది చాలా అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: