జపాన్ దేశానికి చెందిన ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ
హోండా ఒక కొత్త బైక్‌ను త్వరలో విడుదల చేయనుంది.దీనిని కంపెనీ స్వయంగా రెడీ చేస్తోంది. ఈ బైక్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తారు ఇంకా
ఇండియన్ మార్కెట్లో ఈ బైక్‌ను ఏ ధరకు అమ్ముతారు వంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇక ఈ కొత్త బైక్‌ను
మార్చి 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు
హోండా కంపెనీ తెలిపింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం, ఈ బైక్‌ను కంపెనీ మొత్తం 100 సిసి సెగ్మెంట్లో పరిచయం చేయనుంది. ప్రస్తుతానికి, కంపెనీ ఈ సెగ్మెంట్లో ఎలాంటి బైక్‌ను కూడా అందించలేదు. కంపెనీ 110 సిసి సెగ్మెంట్లో కేవలం సిడి 110ని అందిస్తోంది.హోండా కంపెనీ నుంచి వస్తున్న ఈ కొత్త 100 సిసి
బైక్ నేరుగా
హీరో 100 సిసి
బైక్ స్ప్లెండర్కు పోటీని ఇస్తుంది. ఇంకా అంతేకాకుండా, కంపెనీ ఈ కొత్త
బైక్ హీరో HF డీలక్స్ ఇంకా బజాజ్ ప్లాటినా 100 వంటి బైక్‌లకు పోటీగా ఉంటుంది.
అయితే ప్రస్తుతానికి, ఈ
బైక్ విడుదల తేదీని మాత్రమే
హోండా కంపెనీ తెలియజేసింది. బైక్‌లో 100 సిసి ఇంజన్ బైక్ 8 హార్స్పవర్, 8 న్యూటన్ మీటర్ల టార్క్ ఇస్తుందని సమాచారం తెలుస్తుంది. ఒక లీటర్ పెట్రోల్‌లో ఈ బైక్‌ను ఏకంగా 60 నుంచి 70 కిలోమీటర్ల దాకా నడపవచ్చు. ఈ
బైక్ ని ఫోర్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో తీసుకురావచ్చు. దీని ధర విషయానికి వస్తే 60 నుంచి 65 వేల రూపాయల మధ్య ఉంటుంది.ఇక ఇప్పుడు
ఇండియన్ మార్కెట్లో వివిధ విభాగాల్లో
హోండా మొత్తం ఎనిమిది బైక్‌లను అమ్ముతుంది. వీటిలో సిడి110, లివో, షైన్, ఎస్పి125, యూనికార్న్, ఎక్స్ బ్లేడ్, హర్నెట్ ఇంకా అలాగే సిబి200X వంటి బైక్‌లు ఉన్నాయి.ఇవి ఇండియాలో చాలా బాగా వినియోగదారులను ఆకట్టుకుంటూ రికార్డు రేంజిలో అమ్ముడవుతున్నాయి.ఇక రాబోయే
బైక్ కూడా ఖచ్చితంగా మంచి ప్రజాదారణ పొందుతుందని
హోండా కంపెనీ గట్టి నమ్మకంగా ఉంది.