ఇక హీరో మోటో కార్ప్‌ అదిరిపోయే సూపర్ ఫీచర్లతో హీరో Xpulse బైక్‌ను ఇండియన్ మార్కెట్లోకి బుధవారం నాడు లాంచ్ చేసింది.సరికొత్తగా ఈ బైక్‌ 200 4v తో పాటు ప్రో వేరియంట్‌ను కూడా విడుదల చేసింది.అలాగే రెండో దశ బీఎస్‌ 6 ప్రమాణాలకు అనుగుణంగా ఈ అడ్వెంచర్‌ బైక్‌ను హీరో మోటో కార్ప్‌ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ హీరో ఎక్స్‌పల్స్‌  ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ హీరో మోటో కార్ప్‌ ఈ అడ్వెంచర్ hero Xpulse 200 4v బైక్‌లో బీఎస్‌ 6 ప్రమాణాలకు తగ్గట్టు ఇంజిన్‌ను అప్‌డేట్ చేసింది. ఈ హీరో ఎక్స్‌పల్స్‌ 200 4వీ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ బైక్(ఎక్స్‌ షోరూమ్‌) వచ్చేసి రూ.1.43 లక్షల్లో అందుబాటులో ఉండగా ప్రో వేరియంట్ బైక్(ఎక్స్‌ షోరూమ్‌) రూ.1.50 లక్షలు ఉంది. లాంగ్ విండ్‌స్క్రీన్, కొత్త ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్‌లు ఇంకా రైడింగ్ మోడ్‌లను ప్రవేశపెట్టింది.ఇక హీరో ఎక్స్‌ప్లస్ 2004వీ బైక్ (Hero XPulse 200 4V 2023) ప్రో వేరియంట్ పూర్తిగా 250ఎంఎం అడ్జస్టబుల్ ఫ్రంట్‌ సస్పెన్షన్ ఇంకా 220ఎంఎం రేర్‌ సస్పెన్షన్ ఉంటుంది.న్యూ సస్పెన్షన్‌ సెటప్‌ ద్వారా 270 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది.


850 ఎంఎం సీట్ హైట్‌తోపాటు ఎక్స్‌టెండెడ్ గేర్ లివర్ ఇంకా హ్యాండిల్ బార్ రైజర్ ఉంటది.అలాగే హీరో మోటో కార్ప్‌ లాంగ్ విండ్‌స్క్రీన్ ఇంకా కొత్త ప్రొజెక్టర్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లను ఈ కొత్త మోడళ్లలో అప్‌డేట్‌ చేసింది.అలాగే LED హెడ్‌ల్యాంప్‌ల కాంతి తీవ్రతను కూడా 230 శాతం పెంచుకోవచ్చు. ఇంకా అలాగే వాహనదారులకు వీలుగా USB పోర్ట్‌ను ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌కు కింద అమర్చింది.ఇంకా న్యూ స్విచ్‌ గేర్‌ను ఇందులో చూడవచ్చు.ఈ హీరో ఎక్స్‌ప్లస్ 200 4వీ బైక్ (Hero XPulse 200 4V 2023) మూడు న్యూ ఏబీఎస్ రైడింగ్ మోడ్స్‌లో వస్తోంది. రోడ్, ఆఫ్-రోడ్ ఇంకా ర్యాలీ మోడ్‌లలో లభిస్తుంది. డ్రై రోడ్ పైనా దూసుకెళ్లే రోడ్ మోడ్ అలాగే ఆఫ్-రోడ్ మోడ్‌లో ఏబీఎస్ పవర్‌ లెవెల్‌ తక్కువగా ఉంటుంది. అలాగే బైక్‌ మరింత స్లిప్‌ను అనుమతిస్తుంది.ఇసుక, రాళ్ల మధ్య ఇంకా కొండ ప్రాంతాల్లో సజావుగా ఈ బైక్‌ వెళ్లగలుగుతుంది. ఇంకా అలాగే ర్యాలీ మోడ్‌లో ఏబీఎస్ పూర్తిగా స్విచ్చ్‌డ్ ఆఫ్ మోడ్‌లోకి ఆటోమేటిక్‌గా వెళ్లిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: