చాలా మంది తమ చర్మ సౌదర్యం పక్క వారితో పోల్చుకుంటూ వారిలా చర్మం కాంతివంతంగా, నునుపుగా ఉంటే ఎంతో బాగుంటుంది అనుకుంటారు. అందుకోసం మార్కెట్ లో దొరికే రకరకాల బ్యూటీ సాధనాలు వాడుతూ తాత్కాలిక సంతోషం పొందుతారు. కొంతమంది  బయట దొరికే నకిలీ, రసాయనిక సౌందర్య సాధనాలు వాడటం వలన ఉన్న చర్మాన్ని సైతం అంద విహీనంగా మార్చుకుని భాధ పడుతూ ఉంటారు. అయితే తమ ముఖం పొడి బారడానికి కారణాలు ఏమిటి..?? ఎందుకు చర్మం సున్నితంగా ఉండదు అనే కారణాలని తెలుసుకుంటే, కొన్ని కొన్ని సహజ సిద్ద పద్దతులని పాటిస్తే తప్పకుండా మీరు కోరుకున్న విధంగా చర్మ సౌందర్యాని సొంతం చేసుకోగలరు.

 Image result for face honey mask

చర్మం పొడి బారిపోయి, కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చి అంద విహీనంగా మారడానికి ప్రధాన కారణం నిద్ర సరిగా లేకపోవడమే. రోజుకి ఎనిమిది గంటలు పోడుకోవాల్సిన వాళ్ళు పట్టుమని 5 గంటలు కూడా నిద్ర పోకపోవడమే ఈ సమస్యకి ప్రధాన కారణం. ఈ సమస్యని దూరం చేయాలంటే కొన్ని పద్దతులని తగ్గించుకుని, కొన్ని వస్తువులని దూరం పెట్టాల్సిందే. ప్రతీ ఒక్కరు దాదాపు 8 గంట నిద్ర పోవాల్సిందే అందులో వేరే ఆప్క్షన్ పెట్టుకోవద్దు, మరొక ముఖ్యమిన విషయం ఏమిటంటే రాత్రి పూట ఎక్కువగా స్మార్ట్ ఫోన్ లని ఉపయోగించ కూడదు. దీని వలన కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ రావడమే కాకుండా చర్మం మొద్దు బారి పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఆయిల్ ఫుడ్, నెయ్యి పదార్ధాలు, పన్నీర్ ఎక్కువగా తీసుకోవడం వలన కూడా చర్మం సహజత్వాన్ని కోల్పోతుంది.

 Image result for glow face with honey

అయితే సరైన నిద్ర, స్మార్ట్ ఫోన్ దూరం చేయడం ద్వారా మాత్రమే చర్మాని రక్షించు కోలేము, చర్మ సంరక్షలో ప్రధాన భాగంగానే వాటిని దూరం పెడుతాము. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ దూరం చేయాలంటే తేనే తీసుకుని వెలి కొనతో తేనెలో ముంచి డార్క్ సర్కిల్స్ ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. అదేవిధంగా ముఖానికి తేనే అద్ది మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు ఆలివ్ ఆయిల్ లో దూది ముంచి ముఖానికి సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా కూడా ముఖాన్ని సున్నితంగా మార్చుకోవచ్చు. అయితే ముఖానికి ఈ పదార్ధాలు పట్టించిన అరగంట పాటు ఉంచి తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా ముఖాని కడుక్కుంటే సరిపోతుంది. ఇలా చేస్తూ ఉండటం వలన తప్పకుండా మీ ముఖ వచ్చస్సులో వచ్చే మార్పుని గమనించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: