ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ముఖం మీద వున్న మచ్చలు పోవడానికి ఈ పద్ధతులు పాటించండి..రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అలో వెరా జెల్ లో ఒక టీ స్పూన్ తేనె కలిపి పది నిమిషాలు వదిలేయండి. ఆ తరువాత పిగ్మెంటేషన్ ఉన్న ప్రదేశానికి అప్లై చేసి ఆరనివ్వండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.ఒక కప్పు వేడి నీటిలో ఒక గ్రీన్ టీ బ్యాగ్ ఉంచి చల్లారనివ్వండి. చాల్లారిన తరువాత పిగ్మెంటేషన్ ఉన్న ప్రదేశంలో ఈ గ్రీన్ టీ బ్యాగ్ ని రుద్దండి. ఇలా రోజూ రెండు సార్లు చేయవచ్చు.


రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ గంధం పొడి, చిటికెడు పసుపు, రెండు టీ స్పూన్ల పాలు కలిపి ఫేస్ అంతా అప్లై చేయండి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ నీరు కలపండి. ఇందులో దూది ముంచి పిగ్మెంటేషన్ ఉన్న ప్రదేశానికి అప్లై చేయండి. ఆరాక గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి రెండు సార్లు చేయవచ్చు.ఒక ఉల్లిపాయని సగానికి కట్ చేసి అవసరమైన చోట ఆ ముక్కతో రబ్ చేయండ్. పది నిమిషాల తరువాత కడిగేయండి. ఇలా రోజుకి రెండు సార్లు చేయవచ్చు.


నాలుగైదు లికోరిస్ వేర్లని నీటిలో మరగబెట్టండి. నీరు చల్లారిన తరువాత ఒక స్ప్రే బాటిల్ లో పోయండి. రోజుకి రెండు సార్లు మిస్ట్ లా అప్లై చేయండి. ఈ నీటిని ఫ్రిజ్ లో స్టోర్ చేసి, ఎనిమిది నుండి పది రోజుల లోపు వాడేయండి.పాలలో దూది ముంచి అవసరమైన చోట రాయండి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి రెండు సార్లు చేయవచ్చు.ఒక టమాటా ని సగానికి కట్ చేసి ఆ ముక్కతో పిగ్మెంటేషన్ ఉన్న ప్రదేశంలో రుద్దండి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి రెండు సార్లు చేయవచ్చు.ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: