జిడ్డు చర్మం వాళ్ళు దీని కోసం పసుపు, నిమ్మ రసం బొప్పాసి ఉపయోగించాల్సి ఉంటుంది. ఎలా తయారు చేయాలి అనే విషయానికి వస్తే... ఒక అర టీ స్పూన్ పసుపును తీసుకోండి. రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం మరియు 3 టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు తీసుకోండి. ఇప్పుడు బొప్పాయి గుజ్జు లో కొద్దిగా పసుపు నిమ్మరసం వేసి బాగా కలపండి ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి కడిగేయండి. దీని వల్ల ఆయిల్ స్కిన్ వాళ్ళు సూపర్ బెనిఫిట్స్ ని పొందొచ్చు.కొద్దిగా తేనె మరియు కొద్దిగా నిమ్మ రసం మరియు కొద్దిగా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కావాలి. ఈ మిశ్రమం ని తయారు చేయడానికి ముందుగా కొద్దిగా ఆల్మండ్ ఆయిల్ లో తేనె మరియు నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపాక ముఖం మీద అప్లై చేయండి. ఇది అయిపోయిన తర్వాత ముఖాన్ని కడిగేసుకోండి. ఇలా చేయడం వలన మంచి లాభాలని మీరు పొందొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి