మహిళలు సాధారణంగా జుట్టు ఒత్తుగా పెరగడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే జుట్టు రాలిపోకుండా ఉండడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి అలాగే జుట్టు పొడవుగా రావడానికి అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు.. అయితే మనం తీసుకొనే ప్రతి పద్ధతి చాలా జాగ్రత్తగా ఉండాలి.. అయితే ఇప్పుడు కూడా ఒక చిట్కా మీ ముందుకు తీసుకు వచ్చాము. ఆ చిట్కా ఏంటి..దాని వల్ల జుట్టుకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది.. అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


 ఇందుకోసం ముందుగా కావలసిన పదార్థాలు :
 కొబ్బరి నూనె - అర కప్పు
 కరివేపాకు  - 10 నుంచి 15 రెబ్బలు
 మెంతులు - వన్ టేబుల్ స్పూన్
 ఉల్లిపాయ -1 సన్నగా తరిగి పెట్టుకోవాలి.

తయారీ విధానం:
పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక బాణలిలో వేసి, మీడియం మంట పైన బాగా మరిగించాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని కిందకు దింపి చల్లార్చాలి. ఇక ఈ మిశ్రమాన్ని వడకట్టి, ఒక ఎయిర్ టైట్ గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. స్టోర్ చేసినప్పటి నుంచి రెండు మూడు రోజులు లోపు ఈ నూనెను ఎప్పుడైనా తలకు పట్టించుకోవచ్చు.


ఇక ఇలా ఈ నూనెను పట్టించుకోవడం వల్ల జుట్టు రాలే నుండి అధిగమించవచ్చు. అలాగే జుట్టు ఒత్తుగా, కురులు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి.. అయితే ముఖ్యంగా కరివేపాకు వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది అంటే, కరివేపాకులో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి జుట్టుకు కావల్సిన తేమను అందించి, జుట్టుకు అవసరమయ్యే మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. ఇక ఇందులోని ప్రోటీన్లు జుట్టు పటుత్వాన్ని మెరుగుపరుస్తాయి.


ఇక కొబ్బరి నూనె..వాతావరణ కాలుష్యం మన జుట్టుపై పడకుండా సంరక్షణ ఇస్తుంది. కుదుళ్లకు బలాన్ని అందించి,జుట్టు చివరి కొనలు చిట్లిపోకుండా చేస్తుంది.. ఇక మెంతుల్లో ఉండే ప్రోటీన్,నికోటినిక్ యాసిడ్ చుండ్రు, చికాకు వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇక చివరిగా ఉల్లిపాయతో జుట్టు రాలే సమస్యలను దూరం చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: