అమ్మతనం అనేది ఒక మధురమైనది. ఈ అమ్మతనం కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా,  ఎన్నోకలలతో  ఎదురుచూస్తూ ఉంటారు.. ఇక ఈ క్రమంలోనే అమ్మతనం మనలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఈ దశలో అటు శారీరకంగానే కాకుండా సౌందర్య పరంగా కూడా పలు మార్పులు రావడం సహజం. ముఖ్యంగా ముఖం పై మొటిమలు, మచ్చలు, చర్మం పై పిగ్మెంటేషన్ కారణంగా ట్యాన్, విపరీతంగా జుట్టు రాలిపోవడం ఇలా రకరకాలుగా, కొత్తగా తల్లి అయిన వారు ఇలాంటి వివిధ రకాల అందం పరమైన సమస్యలను ఎదుర్కొంటుంటారు.. ఇక అమ్మ అయిన తర్వాత బిడ్డ పుట్టాక, తల్లుల శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోవడమే, ఇందుకు కారణం అని అంటున్నారు నిపుణులు..


అయితే ఇలాంటి సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు అని చెప్తున్నారు నిపుణులు. అయితే వీటి కోసం చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుందట. ఆ చిట్కాలేంటో మనం కూడా తెలుసుకుందాం పదండి..


ప్రసవానంతరం ఎదురయ్యే మొటిమల సమస్యను దూరం చేసుకోవాలంటే, రోజుకు రెండుసార్లు గాఢత తక్కువగా ఉండే ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కలబంద, యూకలిప్టస్ ఆయిల్ వంటి పదార్థాలను ఫేస్ ప్యాక్ ల రూపంలో  చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక అంతే కాకుండా బయటకు వెళ్లేటప్పుడు మాయిశ్చరైజర్ రాసుకోవడం తప్పనిసరి.

ఇక ప్రెగ్నెంట్ అయిన తర్వాత వచ్చే సమస్యలను తొలగించుకోవడానికి, ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల ప్రత్యేకమైన మాయిశ్చరైజర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని నిపుణుల సలహా మేరకు ఉపయోగిస్తే సరిపోతుంది. ఇక వీటిని ఇంట్లో తయారు చేసుకోవాలంటే పసుపు, నిమ్మరసం, కలబంద గుజ్జు, బంగాళదుంప, కమలాపండు  తొక్కల పొడి వంటి వాటిని మీరు వాడే ఫేస్ ప్యాక్ లో చేర్చుకుంటే సరిపోతుంది.

ఇక గర్భం ధరించినప్పుడు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండాలంటే తగు  జాగ్రత్తలు తీసుకోవాలి . ఈ క్రమంలో నిపుణులు సూచించిన ఆయిల్ లేదా క్రీమ్ వంటివి వాడుతుండాలి. అయితే ప్రసవానంతరం ఒకవేళ ఈ సమస్యలు తలెత్తితే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. క్రీమ్స్ లేదా ఆయిల్ తో పాటు చక్కటి పోషకాహారం, బ్రిస్క్ వాక్, యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల, ఈ స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించడం కొంతవరకు సులభం అవుతుంది..


ప్రసవానంతరం జుట్టు రాలే సమస్యను అదుపు చేయాలంటే, మనం తీసుకొనే ఆహారంతోనే అది సాధ్యమవుతుంది. ఈ క్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీస్, పాలకూర, డార్క్ చాక్లెట్ వంటివి తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవన్నీ కూడా జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: