రాజస్థాన్ లోని అజ్మీర్ షరీఫ్ దర్గా కు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక్కడికి పెద్ద పెద్ద సెలబ్రెటీలు వచ్చి దర్గాను దర్శించుకుంటారు. తాము కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత అజ్మీర్ షరీఫ్ దర్గా వద్దకు తప్పకుండా వస్తారు. గత కొంత కాలంగా కరోనా నేపథ్యంలో ఇక్కడ సందడి బాగా దగ్గిపోయింది. గుళ్లు,దర్గాలు, చర్చీలు సైతం మూసి వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అన్ లాక్ 4.0 తర్వాత ప్రజలు ఎక్కువగా బయట తిరగడం..రవాణా వ్యవస్థ పుంజుకోవడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో అజ్మీర్ షరీఫ్ దర్గా, త్రిపుర సుందరి దేవాలయం, సిద్ధ్ హనుమాన్ మందిర్, కైలాదేవి, మదన్ మోహన్ దేవాలయం, గాలియాకోట్ దర్గా తదితర పుణ్యక్షేతాల్రు సోమవారం భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్-4 నియమావళి ప్రకారం ప్రార్థనా స్థలాలను ఈ నెల 7వ తేదీన పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గా కూడా సోమవారం తెరుచుకోనుంది.