తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగాయి. నిన్న కరోనా కేసులు 600 లోపే నమోదు అయ్యాయి. నేడు మరోసారి కేసులు ఎక్కువగా నమోదు కావడం కంగారు పెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో నిన్న 837  కొత్త కేసులు నమోదు అయ్యాయి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.

1,554 రికవరీలు నిన్న నమోదు అయ్యాయి. ఇక మరణాల విషయంలో తెలంగాణా చాలా మెరుగ్గా ఉంది. 4 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 2,32,671 కు చేరాయి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీటిలో 2,13,466 రికవరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి 1,315  మంది ప్రాణాలు కోల్పోయారు అని ప్రభుత్వం పేర్కొంది. యాక్టివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. 17,890 క్రియాశీల కేసులు ఉన్నాయని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: