హైదరాబాద్ లో  వరద ముంపు బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పంపిణీ కొన్ని చోట్ల వివాదాలకు దారి తీసింది. స్థానిక టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని కొన్ని చోట్ల సాయం అందడం లేదని మరి కొన్ని చోట్ల అనేక ఆరోపణలు బయటకి వస్తున్నాయి. నిన్న కూకట్ పల్లి దాయారుగుడాలో  వరద బాధితులకు నష్టపరిహారం అందించే విషయంలో బాధితులకు అన్యాయం జరుగుతుందని బుధవారం కొందరు బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు.

అలా ధర్నా చేసిన బీజేపీ నాయకులపై, స్థానికుల పై అర్థ రాత్రి బీరు సీసాలతో, రాళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు దాడి చేశారు. అయితే ఈ దాడి టీఆర్ఎస్ నాయకులే దాడి చేయించారని బీజేపీ ఆరోపిస్తోంది. కొన్ని చోట్ల పదివేల ఆర్ధిక సాయంలో సగం టీఆర్ఎస్ గల్లీ నేతలు తీసుకుని మరో ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: