బెంగాల్ పోలింగ్ సాక్షిగా పలు చోట్ల దాడులు జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే పోలింగ్ జరుగుతోన్న పశ్చిమ
మిడ్నాపూర్ జిల్లాలో
బీజేపీ కార్యకర్త ప్రత్యర్థుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. కేశియారిలోని బేగంపూర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మంగల్ సోరెన్ ఈ రోజు ఉదయమే తన ఇంటి ముందు విగతజీవిగా కనిపించాడు. తమ
పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటోన్న సోరెన్‌ను తృణమూల్ గుండాలే హత్య చేశారని
బీజేపీ నాయకులు ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలను
జిల్లా ఎన్నికల అధికారులు కొట్టి పడేశారు. సోరెన్ మృతికి ఎన్నికలకు సంబంధం లేదని చెప్పారు. ఈ ఘటనతో పశ్చిమ
మిడ్నాపూర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.