మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా రాకాసి కోరల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి అరుణ్‌కుమార్ సింగ్ కూడా క‌రోనా కాటుకు బ‌ల‌య్యారు. ఇటీవల కోవిడ్ బారినపడ్డ బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ సింగ్ పట్నాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. . 1985 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అరుణ్ కుమార్ సింగ్.. ఫిబ్రవరి 28 బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. సీఎస్ మృతిపై మాజీ సీఎం జీతన్‌రాం మాంఝీ, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ సహా పలువురు నేతలు, అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: