సోనూ సూద్.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మనసుల్లో ముద్రపడిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్ఛందంగా ఆదుకున్న సోనూ సూద్ సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇదొక్కటే కాదు, ఆయన చేసిన పలు సేవా కార్యక్రమాల గురించి చెప్పడానికి మాటలు చాలవు.. ఆపద ఉన్న చోటల్లా తాను అవసరమై ఆదుకున్నారు. అయితే, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడును రియల్ హీరో సోనూ సూద్ లంచ్ కు ఆహ్వానించారు. ఇటీవల శ్రీకాకుళం నగరానికి చెందిన యువకుడు తయారు చేసిన సోనూ సూద్ చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ..సోనూ సేవలను ఎంపీ అభినందించిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన సోనూ.. ఆ యువకుడిని తీసుకోని మీరు లంచ్ కి రావాలని ఆహ్వానిస్తూ ట్విట్టర్లో సోనూ సూద్ విజ్ఞప్తి చేశారు.
 సోనూ సాయం చేయండి ప్లీజ్ అంటే చాలు నేనున్నా అంటూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అలాంటి మానవతావాదికి శ్రీకాకుళం నగరానికి చెందిన లాల్‌ ప్రసాద్‌ అనే యువకుడు .. బొగ్గుతో సోనూసూద్‌ నిలువెత్తు బొమ్మను గీశాడు. రియల్ హీరోపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: