సాయి పల్లవి, ఫాహద్‌ ఫాజిల్, ప్రకాశ్‌రాజ్, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అథిరన్‌’. వివేక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఏడాది ఏప్రిల్‌లో విడుదలై మలయాళంలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఎ.కె. కుమార్, జి. రవికుమార్‌ తెలుగులో ‘అనుకోని అతిధి’గా అనువదించారు. ఫహాద్ ఫైజల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో పెద్ద హిట్ అయింది. "సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. 1970లలో కేరళలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ప్రభాస్‌ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. సాయి పల్లవి, ఫహద్ నటించిన అతిరాన్(‘అనుకోని అతిధి’) ఇప్పుడు తెలుగులో ఆహా ప్లాట్‌ఫాంపై ప్రీమియర్స్ మే 28న ప్రసారం చేయబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఒకటి రానా హీరోగా రూపొందుతున్న ‘విరాటపర్వం’ కాగా.. మరొకటి శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం.


మరింత సమాచారం తెలుసుకోండి: