టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ రోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్‌కు సినిమా, ఇత‌ర రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. సోష‌ల్ మీడియా అంతా ఎన్టీఆర్ బ‌ర్త్ డే విషెస్‌తో ద‌ద్ద‌రిల్లి పోతోంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎన్టీఆర్ ను విష్ చేస్తున్నారు. ఈ రోజే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు రెండు స‌ర్ ఫ్రైజింగ్ న్యూస్‌లు కూడా వ‌చ్చాయి. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఆర్.ఆర్.ఆర్ సినిమాకు సంబంధించి లుక్ రిలీజ్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ 30వ సినిమాగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా ఫ‌స్ట్ లుక్ కూడా అదిరిపోయింది. అయితే జీ తెలుగు ఎన్టీఆర్‌కు చాలా స‌ర్‌ప్రైజింగ్ గా బ‌ర్త్ డే విషెస్ చెప్పింది. ఎన్టీఆర్ న‌టించిన సినిమాల పేర్లు, వివిధ సినిమాల్లో ఎన్టీఆర్ స్టిల్స్‌ను డిజైన్ చేస్తూ వేసిన పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: