
ప్రపంచవ్యాప్తంగా ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరో వైపు వ్యాక్సినేషన్ కూడా జోరుగా కొనసాగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దేశాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం అయింది. వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం కోరుతున్నా పెద్దగా జనం ఆసక్తి చూపడం లేదు. అందుకే ప్రతి ఒక్కరు టీకాలు వేయించుకోవాలని ప్రభుత్వం సహా ఇతర సంస్థలు సైతం కోరుతున్నాయి.
అందుకు పలు రకాలుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోవడాన్ని ప్రోత్సహించేందుకు వివిధ సంస్థలు సైతం ఉచిత ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాలో అయితే ఉబర్ సంస్థ ఫ్రీ రైడ్స్ ఇస్తుంటే, కొన్ని షాపుల వాళ్ళు ఫ్రీ బీర్స్ కూడా ఇస్తున్నారు.