తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా తాజాగా వారి జాబితాలో చేరిపోయింది. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైన బండి సంజయ్ అద్భుతమైన నాయకుడని ఆమె ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో బండి సంజయ్ కు మంచు లక్ష్మి ఇలా విష్ చేయడానికి గల కారణం ఏంటని విశ్లేషణలు జరుపుతున్నారు. 

కాగా బండి సంజయ్ ప్రయాణం కార్పొరేటర్ నుంచి ఎంపీ వరకు సాగిన విషయం తెలిసిందే. 2005లో కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో 48 వ డివిజన్ నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ కార్పొరేటర్ గా మూడు సార్లు గెలిచారు. ఆ తర్వాత రెండు సార్లు కరీంనగర్ బిజెపి అధ్యక్షుడిగా పని చేసాడు. 2014 లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. కానీ 2018లో తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బిజెపి తరఫున పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓడిపోయాడు. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ ఓటు తేడాతో ఓడించి గెలిచాడు. ఆ తర్వాత 2020 మార్చ్ 11న ఆయనను బిజెపి హై కమాండ్ తెలంగాణ బిజెపికి అధ్యక్షుడిగా నియమించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: