జూలై 26న ఆ కర్ణాటక సీఎం యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎన్నిక జరిగే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఉండబోతున్నారు, ఇక ఈ కొత్త సీఎం ఎంపిక, అలాగే రాష్ట్ర వ్యవహారాలను పరిశీలించడానికి కేంద్రం నుంచి కిషన్ రెడ్డి నేడు బెంగుళూరు కి చేరనున్నారు. నేటి సాయంత్రం ఎమ్మెల్యేలు అంతా కలిసి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. ఇక ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను భారతీయ జనతా పార్టీ పరిశీలకుడిగా బెంగళూరు వెళుతున్నట్లు తెలిపారు. ఇక కొత్త ముఖ్యమంత్రిగా ఎవరి పేరు ప్రకటించబోతున్నారు అని జర్నలిస్టులు ప్రశ్నించగా ప్రస్తుతం ఆ వివరాలన్నీ కూడా పార్టీ పరిశీలనలో ఉన్నాయని ఎమ్మెల్యేల సమావేశం అనంతరం కొత్త నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: