సామాన్యులకు ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి మెట్రో ని ప్రవేశపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ హైదరాబాద్ లో మెట్రో ఇకపై మూతపడనున్న అంటే. అవును అనే సంకేతాలు బయటికి వస్తున్నాయి. గతంలో ఎంతో హడావిడి చేస్తూ మెట్రో పనులు చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మెట్రో నిర్మాణ సంస్థ వర్గాలతో భేటీ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాదులో గల మెట్రో అత్యంత తీవ్రమైన నష్టాలతో నడుస్తోంది. నష్టాల నుంచి బయటపడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ సహాయం చేయడానికి హామీ ఇచ్చారు. కానీ ఎలాంటి సహాయం చేస్తారో స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వ సహాయం పై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు అంతర్జాతీయ విమానాశ్రయానికి అందుబాటులో ఉండేలా ఒక మెట్రోను ప్రారంభించాలని అనుకున్నప్పటికీ ఇప్పటికే నష్టాల్లో ఉన్న మెట్రో ఆ మార్గాన్ని ఎప్పుడు పూర్తి చేస్తుందో అనే అనుమానాలు జనాల్లో మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: