బద్వేల్ ఉప ఎన్నిక నేపధ్యంలో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఎన్నికలో అధికార పార్టీ విజయం సాధించడం దాదాపుగా ఖాయంగా కనపడుతున్నది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ వద్దని తప్పుకోగా బిజెపి పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బిజెపి జనసేన నేతల మధ్య బద్వేలు లో పోటీపై చర్చలు జరిగాయి.

ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో ఆయన సతీమణికి టికెట్ ఇవ్వటంతో పోటీ చేయబోమని జనసేన పార్టీ ప్రకటన చేసింది. జనసేన ప్రకటనతో సందిగ్ధంలో బిజెపి పడింది. ఈరోజు కడపలో బిజెపి ముఖ్యనేతల సమావేశం జరుగుతున్నది. ఇప్పటికే వైసిపి, టీడీపీ అభ్యర్థుల ప్రకటన కూడా జరిగింది. బిజెపి నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap